బిజినెస్

మరో రూ.523 కోట్ల ఆస్తులు జప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో కీలక సూత్రధారి, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ నివాసాలు, సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దాడులు కొనసాగుతున్నాయి. శనివారం కూడా ఈడీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా 21 ఆస్తులను జప్తు చేశాయి. వాటిలో విలాసవంతమైన పెంట్‌హౌస్, ఫార్మ్‌హౌస్ ఉన్నాయి. తాజాగా జప్తు చేసిన స్థిరాస్తుల విలువ దాదాపు రూ.523 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తప్పుడు లెటర్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ పత్రాలు సమర్పించి ముంబైలోని ఒక శాఖ ద్వారా దాదాపు 11,400 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై నీరవ్‌మోదీ, అతడి మేనమామ మెహల్ ఛోస్కీ, వారికి చెందిన సంస్థలపై ఈడీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నీరవ్‌మోదీ ఆస్తులను జప్తు చేస్తున్నట్లు నోటీసులు పంపామన్న అధికారులు వివరాలు వెల్లడించారు. మూడు ఫ్లాట్‌లను అనుసంధానం చేస్తూ కట్టిన భవంతిలో 81.16 కోట్ల విలువైన పెంట్‌హౌస్‌ను, ముంబయిలోని వర్లీ తీరంలో సముద్రానికి అభిముఖంగా కట్టుకున్న రూ. 15.45 కోట్ల ఖరీదైన, విలాసవంతమైన ‘సముద్ర మహల్’ అపార్ట్‌మెంట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. నీరవ్‌మోదీ, అతడి నిర్వహణలోని సంస్థలకు చెందిన 21 స్థిరాస్తులను జప్తు చేశామని, వాటి విలువ సుమారుగా రూ. 523.71 కోట్లు ఉంటుందని వారు వెల్లడించారు. వీటిలో ఆరు నివాస గృహాలు, పది కార్యాలయ భవనాలు, పూనేలో రెండు ఫ్లాట్‌లు, ఒక సౌరవిద్యుత్ ప్లాంట్, అహ్మద్ నగర్‌లోని కర్జత్‌లో 135 ఎకరాల అలీబగ్ ఫార్మ్‌హౌస్ ఉన్నాయని వారు వివరించారు. నీరవ్‌మోదీ నివాసాలు, సంస్థలపై గత కొన్ని రోజులుగా దాడులు చేస్తున్న ఈడీ ఇప్పటికే ఎంతో విలువైనన వజ్రాలు, ఆభరణాలు, షేర్లు, బ్యాంకు డిపాజిట్లు, ఖరీదైన కార్లు సహా పలు చరాస్తులను జప్తు చేశారు. కాగా ఇప్పుడు ఎంతో విలువైన స్థిరాస్తులను జప్తు చేయడం ఈ కేసులో కీలక మలుపు. జప్తు చేసిన ఆస్తుల్లో సముద్రమహల్, పూనేలోని హదప్సర్‌లోని రెండు ఫ్లాట్లు నీరవ్‌మోదీ భార్య అమీ పేర ఉండగా ముంబయిలోని ప్రముఖ కాలాఘోడా అండ్ ఒపెరా హౌస్ నీరవ్‌మోదీకి చెందిన ఫైర్‌స్టార్టర్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేర రిజిస్టరైంది. కాగా 41.70 కోట్ల విలువైన సముద్రతీరంలోని అలీబగ్ ఫార్మ్‌హౌస్ నీరవ్‌మోదీ ట్రస్ట్ పేరిట నమోదై ఉండగా 53 ఎకరాల్లో కొలువైన రూ. 70 కోట్ల విలువ చేసే సౌరవిద్యుత్ ప్లాంట్‌ను కూడా అధికారులు జప్తు చేశారు. మార్క్ బిజినెస్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఉన్న రూ. 80 కోట్ల విలువైన రెండు కార్యాలయ భవనాలు జప్తు చేసిన వాటిలో ఉన్నాయి. ఇప్పటివరకు ఈడీ అధికారులు జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.6,393 కోట్లు ఉంటుందని చెప్పారు. కాగా పీఎన్‌బీలో జరిగిన రూ.11,400 కోట్ల కుంభోకోణంలో ప్రధాన నిందితులుగా పేర్కొంటున్న నీరవ్‌మోదీ, అతడి బంధువు మెహల్ ఛోస్కీలను ఈ నెల 26న జరిగే విచారణకు హాజరవుకావలసిందిగా ఈడీ సమన్లు పంపిన నేపథ్యంలో ఈ దాడులు కొనసాగాయి.