బిజినెస్

నీరవ్ మోదీ, ఛోస్కీ పాస్‌పోర్టులు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన భారీ కుంభకోణంలో ప్రధాన నిందితులు నీరవ్‌మోదీ, అతడి బంధువు మెహల్ ఛోస్కీల పాస్‌పోర్టులను రద్దు చేశారు. ఈ మేరకు వారికి విదేశాంగ శాఖ అధికారులు సమాచారం పంపినట్లు తెలిసింది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ సలహా మేరకు వారి పాస్‌పోర్టులను నాలుగు వారాల పాటు సస్పెన్షన్‌లో ఉంచిన అధికారులు వాటిని ఎందుకు రద్దు చేయకూడదో వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని నీరవ్‌మోదీ, మెహల్ ఛోస్కీలకు తాఖీదులు ఇచ్చారు. అయితే వారు ఇప్పటివరకు స్పందించకపోవడంతో వాటిని రద్దు చేసినట్లు తెలిసింది. దర్యాప్తు సంస్థల సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని సంబంధిత మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు. అయితే దీనిపై నీరవ్‌మోదీ తరపున వాదిస్తున్న న్యాయవాది విజయ్ అగర్వాల్ స్పందిస్తూ దర్యాప్తు సంస్థలు పరస్పర విరుద్ధంగా వివరాలు చెబుతున్నాయని అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, పాస్‌పోర్ట్ విభాగం అధికారులు పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వారి పాస్‌పోర్టులను మొదట సస్పెండ్ చేసినట్లు చెప్పిన సంబంధిత అధికారులు ఇప్పుడు రద్దు చేసినట్లు చెబుతున్నారని, మరోవైపు విచారణలో పాలుపంచుకునేందుకు భారత్‌కు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు పిలుస్తున్నారని, పాస్‌పోర్టు లేకుండా వారు విచారణకు ఎలా హాజరవుతారని అగర్వాల్ ప్రశ్నించారు.

చిత్రం..రోటోమాక్ పెన్నుల సంస్థ అధినేత విక్రమ్ కొఠారీని శనివారం లక్నోలోని
కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకువచ్చిన పోలీసులు