బిజినెస్

లాభాలతో ముగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం దరిమిలా ఒడుదుడుకులకు లోనైన దేశీయ మార్కెట్ల లావాదేవీలు ఈ వారంలో లాభాలతో ముగిశాయి. శనివారం క్రయవిక్రయాలు ముగిసేసరికి బీఎస్‌ఈ సెనె్సక్స్ వారాంతానికి 34,142.15 పాయింట్లకు చేరుకుని 131.39 పాయింట్ల లాభాలను నమోదు చేసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,491.05 పాయింట్లకు చేరుకుని 38.75 పాయింట్లతో లాభాలు ఆర్జించింది. ఈ వారంలోనే అత్యధికంగా 34,053.95 స్థాయికి చేరిన సెనె్సక్స్ 34,167.60, 33,554.37 పాయింట్ల మధ్య ఊగిసలాడి 34,142.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. 0.39 శాతం మేరకు అంటే 131.39 పాయింట్ల మేరకు లాభాలను గడిచింది. గత వారంతో పోలిస్తే పోలిస్తే 5 శాతం మేరకు పాయింట్లు అధికంగా ఆర్జించింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 10,488.90 పాయింట్లతో వారం మొదట్లో లావాదేవీలు ప్రారంభించింది. ఈ వారంలో 10,499.10 - 10,302.75 పాయింట్ల మధ్య ఊగిసలాడిన నిఫ్టీ చివరకు 10,491.05 పాయింట్ల వద్ద స్థిరపడి 38.75 పాయింట్ల మేరకు లాభాలను నమోదు చేసింది. పీఎన్‌బీ కుంభకోణం వెలుగు చూసిన తరువాత ప్రభుత్వరంగ సంస్థల షేర్ల విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణం ముప్పు ఉందన్న ఆర్‌బీఐ హెచ్చరికల నేపత్యంలో దేశీయ మార్కెట్లు గందరగోళంలో పడ్డాయి. అయితే మార్చి డెరివేటివ్స్ బలంగా ఉండటం, ఎగుమతులు పెరుగుతున్నాయన్న నాస్కామ్ నివేదికల నేపథ్యంలో మార్కెట్లు కోలుకొని వారాంతానికి లాభాలను చవి చూశాయి.