బిజినెస్

టాటా గూటికి వెల్‌స్పన్ రెన్యువబుల్ ఎనర్జీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: వెల్‌స్పన్ ఎనర్జీ అనుబంధ సంస్థ వెల్‌స్పన్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ (డబ్ల్యుఆర్‌ఇపిఎల్)ను టాటా పవర్ కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు సోమవారం టాటా పవర్ తెలియజేసింది. 9,249 కోట్ల రూపాయలకు టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ (టిపిఆర్‌ఇఎల్).. డబ్ల్యుఆర్‌ఇపిఎల్‌ను చేజిక్కించుకుంటోంది. షేర్ల కొనుగోలు ఒప్పందం (ఎస్‌పిఎ) ద్వారా ఈ లావాదేవీ జరగనుందని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు టాటా పవర్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రకటన ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2015-16) డబ్ల్యుఆర్‌ఇపిఎల్ ఏకీకృత ఆదాయం 768 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) ఇది 761 కోట్ల రూపాయలుగా, ఆపై ఆర్థిక సంవత్సరం (2013-14) 228 కోట్ల రూపాయలుగానే నమోదైంది. టాటా పవర్ 100 శాతం అనుబంధ సంస్థ టిపిఆర్‌ఇఎల్. ఇది వెల్‌స్పన్ ఎనర్జీతో దాని అనుబంధ సంస్థ అయిన డబ్ల్యుఆర్‌ఇపిఎల్‌ను కొనుగోలు చేయడానికి ఓ ఎస్‌పిఎపై సంతకం కూడా చేసింది. అంతేగాక దేశంలోనే రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో తమ లావాదేవీ అతిపెద్దదని తెలిపింది.
ఇకపోతే దేశంలో సౌర విద్యుదుత్పత్తి పెద్ద ఎత్తున చేస్తున్న సంస్థల్లో వెల్‌స్పన్ రెన్యువబుల్ ఎనర్జీ కూడా ఒకటి. 10 రాష్ట్రాల్లో వెల్‌స్పన్ పునరుత్పాదక శక్తి కేంద్రాలుండగా, ఇందులో సుమారు 990 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు, దాదాపు 150 మెగావాట్ల పవన శక్తి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల్లో 1,000 మెగావాట్ల ఉత్పత్తి ప్రస్తుతం జరుగుతుండగా, మరో 140 మెగావాట్ల ప్రాజెక్టులు ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. కాగా, డబ్ల్యుఆర్‌ఇపిఎల్ కొనుగోలుతో టిపిఆర్‌ఇఎల్ బలోపేతమవుతుందన్న విశ్వాసాన్ని టాటా పవర్ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ సర్దానా ఓ ప్రకటనలో వ్యక్తం చేశారు.