బిజినెస్

ప్రధానిది కాదు.. మంత్రులదే నిర్ణయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: ప్రభుత్వరంగ సంస్థల్లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)ల అదనపు బాధ్యతలపై నిర్ణయం ఇక ప్రధాన మంత్రి చేతుల్లో ఉండదు. ఆ నిర్ణయాన్ని ఇకపై ఆయా శాఖల మంత్రులే తీసుకుంటారు. ఇప్పటిదాకా ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ (ఎసిసి)నే ఆయా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో (సిపిఎస్‌ఇ) సిఎండి, ఎండిలకు అదనపు బాధ్యతల అప్పగింత వ్యవహారం చూసుకునేది. అయితే ఈ అధికారాన్ని సంబంధిత శాఖల మంత్రులకే ఎసిసి అప్పగిస్తోంది. పర్సనల్ మినిస్ట్రీ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారమే ఈ మార్పులన్నీ. షెడ్యూల్ ‘సి’,‘డి’ సిపిఎస్‌ఇల్లో బోర్డుస్థాయి పదవుల నిర్ణయాధికారం కూడా ఇక మంత్రులదే. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ఎ,బి,సి,డి షెడ్యూళ్లుగా విభజించగా, సి షెడ్యూల్‌లో 64 సంస్థలు, డి షెడ్యూల్‌లో 11 సంస్థలున్నాయి. పదేళ్ల క్రితం నాటి మార్గదర్శకాలను సవరించి కొత్త నిబంధనలను తాజాగా ప్రవేశపెట్టారు. ఇకపోతే ప్రస్తుత ఎసిసిలో ప్రధాని మోదీ నాయకుడిగా, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభ్యుడిగా ఉన్నారు.