బిజినెస్

అంతర్జాతీయ ప్రతికూలతలతో.. 239 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 238.98 పాయింట్లు పడిపోయి 26,396.77 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 59.45 పాయింట్లు దిగజారి 8,110.60 వద్ద నిలిచింది. ఏప్రిల్ నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ పతనం కావడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీనికితోడు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మదుపరులను అమ్మకాల ఒత్తిడికి గురిచేశాయి. ఈ క్రమంలోనే వరుసగా మూడోరోజు సూచీలు క్షీణించాయి. ఇకపోతే బిఎస్‌ఇ మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు వరుసగా 0.50 శాతం, 0.45 శాతం చొప్పున నష్టపోయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, పవర్, మెటల్, ఆటో రంగాల షేర్ల విలువ 1.32 శాతం నుంచి 0.96 శాతం మేర పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, సింగపూర్ సూచీలు 3.21 శాతం వరకు నష్టపోయాయి. జపాన్ సూచీ 3.51 శాతం దిగజారింది. ఐరోపా మార్కెట్లు కూడా పతనమయ్యాయి. ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.28 శాతం నుంచి 1.25 శాతం వరకు క్షీణించాయి.