బిజినెస్

సింగరేణిలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని/కొత్తగూడెం, మార్చి 10: సింగరేణి బొగ్గు పరిశ్రమలో కారుణ్య నియామకాల ఏర్పాటుకు సంబంధించి అనేక తర్జన భర్జన తరువాత తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కారుణ్య నియామకాల విషయంలో సింగరేణి యాజమాన్యం శనివారం ప్రత్యేక సర్క్యూలర్‌ను జారీ చేసింది. దశాబ్దంన్నర కాలం క్రితం తెలుగుదేశం హయాంలో సింగరేణి పరిశ్రమలో వారసుల ఉద్యోగాలకు చెక్ పడింది. ఆ నాటి నుంచి రాష్ట్రం ఏర్పాటు దాకా గని కార్మికుల వారసులకు ఉద్యోగాలు వస్తాయన్న ఎదురుచూపు త్వరలో ఫలించబోతుంది. రాష్ట్రం వస్తే ఎలాగైనా కంపెనీలో కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోబోతున్నాడు. సర్క్యూలర్ జారీ విషయంపై అనేక మీమాంసాలు... జాప్యాలు... ఆందోళనల మధ్య ఈ ఘటన కోర్టును ఆశ్రయించే వరకు వెళ్లింది. తిరిగి కారుణ్య నియామకాల ఏర్పాటు విషయంపై ఎలాగైనా సర్కూలర్ జారీ చేయించి తీరాలన్న విషయాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న రాష్ట్ర సర్కారు చివరకు శనివారం రోజుతో జీవో జారీ చేయించి అనుమానాలకు తెర దింపారు. గతంలో కారుణ్య నియామకాల ఉద్యోగాలకు సంబంధించి మెడికల్ అన్‌ఫిట్‌లో కొన్ని రోగాలను మాత్రమే చేర్చగా ఇప్పుడు కొత్తగా మరికొన్ని రోగాలను కూడా చేర్చి వారికి కూడా మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకునే విధంగా అవకాశం కల్పించిన్నట్లు తెలుస్తుంది. అలాగే దత్తపుత్రులకు, కార్మికులు కుటుంబంలోని పెళ్లి కానీ కూతురుకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా సర్కూలర్‌ను జారీ చేసిన్నట్లుగా తెలియవస్తుంది. ఇప్పటి వరకు మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 2వ వారం నుంచి మెడికల్ బోర్డు ప్రక్రియ ప్రారంభం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు ఉస్మానియా, నిమ్స్‌కు సంబంధించిన ప్రత్యేక వైద్య నిపుణులచే పరీక్షలు జరిపించనున్నారు. వీలైనంత వరకు సింగరేణిలో వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంపై సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవ చూపబోతున్నట్లు స్పష్టం అవుతుంది. సర్క్యూలర్ జారీతో సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలోని కార్మిక కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతుంది. ఇది ఇలా ఉండగా అసలు సర్కూలర్ జారీలో పూర్తి విధివిధానాలు బయటకు వచ్చాక ఎంత మేరకు కార్మిక కుటుంబాల్లోని వారసులకు ఉపాధి అవకాశాలపై న్యాయం జరుగుతుందో తెలిసిపోనుంది.