బిజినెస్

మార్కెట్‌పై అమ్మకాల ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 10: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారమంతా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. కీలక సూచీలు పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 739.80 పాయింట్లు పడిపోయి, 33,307.14 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 231.50 పాయింట్లు దిగజారి 10,300 పాయింట్ల స్థాయికన్నా దిగువకు పడిపోయి, 10,226.85 పాయింట్ల వద్ద స్థిరపడింది. అమెరికా ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలను విధించడంతో ప్రపంచ వాణిజ్య యుద్ధం (గ్లోబల్ ట్రేడ్ వార్) సంభవించే ప్రమాదం ఉందనే ఆందోళన మదుపరులలో నెలకొనడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో పటిష్ఠత దెబ్బతిన్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో రెండు శాతానికి పైగా దిద్దుబాటుకు గురయ్యాయి.
ఆరు నెలల కనిష్టానికి పడిపోయిన దేశ సేవల రంగ గణాంకాలు కూడా ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ)లో వెలుగుచూసిన భారీ కుంభకోణం మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో పాటు, నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏల) సమస్యతో బ్యాంకుల షేర్ల విలువ పడిపోయింది. నిక్కెయి ఇండియా సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు ఈ వారంలో వెలువడ్డాయి. జనవరిలో 51.7 ఉన్న ఈ సూచీ ఫిబ్రవరిలో 47.8కి పడిపోయింది. 2017 ఆగస్టు నుంచి ఇంత దిగువ స్థాయికి ఈ సూచీ పడిపోవడం ఇదే మొదటిసారి.
ఈ అంశం దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ధరలు పడిపోయిన విలువయిన షేర్లను చేజిక్కించుకోవడానికి మదుపరులు పూనుకోవడంతో ఈ వారం నాలుగో సెషన్‌లో దేశీయ స్టాక్ మార్కెట్‌లో ర్యాలీ వచ్చే పరిస్థితులు కనపడ్డాయి. అయితే ఈ సానుకూల పరిస్థితి ఎంతోసేపు నిలబడలేదు. అమెరికా వైఖరితో ప్రపంచ వాణిజ్య యుద్ధం వస్తుందనే భయాందోళనలదే పైచేయి అయింది. సెనె్సక్స్ ఈ వారంలో 34,034.28 పాయింట్ల వద్ద ప్రారంభమయి, 34,060.13- 32,991.14 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 739.80 పాయింట్లు (2.17 శాతం) నష్టపోయి, 33,307.14 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం వారం 95.21 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ ఈ వారం 10,428.30 పాయింట్ల వద్ద ప్రారంభమయి, 10,441.35- 10,141.55 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 231.50 పాయింట్ల (2.21 శాతం) నష్టంతో 10,226.85 పాయింట్ల వద్ద స్థిరపడింది.కన్య్సూమర్ డ్యూరేబుల్స్ మినహా అన్ని రంగాల షేర్లు ఈ వారంలో అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.88 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 4.31 శాతం చొప్పున పడిపోయాయి. లోహ, ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల ధరలు భారీగా పతనమయ్యాయి. పవర్, చమురు- సహజ వాయువు, క్యాపిటల్ గూడ్స్, ఐపీఓలు, స్థిరాస్తి, బ్యాంకులు, వాహన, ఎఫ్‌ఎంసీజీ, టెక్నాలజి, ఐటీ రంగాలు తరువాత స్థానాన్ని ఆక్రమించాయి. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) కలిసి ఈ వారంలో నికరంగా రూ. 774.24 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.