బిజినెస్

52కు చేరిన ప్రాధాన్యతా ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 12: రాష్ట్రంలో ఇరిగేషన్‌కు సంబంధించి ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో మరో రెండు ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేర్చారు. పోలవరం సహా వివిధ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సోమవారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని గుండ్రేవుల రిజర్వాయర్, తోటపల్లి కుడి, ఎడమ కాలువల అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ రెండింటితో ప్రాధాన్య ప్రాజెక్టుల సంఖ్య 52కు చేరింది. ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రారంభించగా మరో 5 పూర్తయ్యాయని తెలిపారు. జూన్ 15 నాటికి మరో 15 ప్రాజెక్టులు పూర్తికానున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు 54శాతం పూర్తయిందని తెలిపారు. జలసంరక్షణ ఉద్యమం చేపట్టి నెల రోజులు కావస్తోందని, 247 కోట్ల రూపాయల పనులు చేపట్టామన్నారు.
ప్రారంభానికి సిద్ధంగా 5 ప్రాజెక్టులు
గోదావరి-పెన్నా, గోదావరి-కృష్ణా, వంశధార-నాగావళి అనుసంధానాలతో ఏర్పడే మహా సంగమం ద్వారా ఏపీలో కరవుకు చెక్ పెట్టనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో మరో రెండు ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. వాటితో కలిపి రాష్ట్రంలో 52 ప్రాజెక్టులను ప్రాధాన్యతాపరంగా గుర్తించగా, వాటిలో ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయన్నారు. ప్రస్తుతం ప్రారంభానికి 5 ప్రాజెక్టులు సిద్ధంగా ఉండగా, వచ్చే జూన్ నాటికి 15 ప్రాజెక్టులను పూర్తిచేయనున్నామన్నారు. ఇవే కాకుండా ఈ ఏడాది డిసెంబర్ నాటికి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తిచేసేలా ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించిందన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సోమవారం పోలవారంగా గుర్తించి సీఎం చంద్రబాబునాయుడు 53వ వర్చువల్ సమావేశాన్ని సచివాలయంలో సోమవారం నిర్వహించారన్నారు. ఈ ఏడాది మే నాటికి డయాఫ్రమ్ వాల్, జూన్ 15 నాటికి జెట్ గ్రౌంటింగ్ పనులు పూర్తవుతాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు 54.4 శాతం పూర్తయిందన్నారు. కుడి ప్రధాన కాలువ 91 శాతం, ఎడమ ప్రధాన కాలువ 59 శాతం, హెడ్ వర్‌క్స 41.2 శాతం పూర్తయ్యాయన్నారు. స్పిల్‌వే, ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్, గేట్లకు సంబంధించి మొత్తం 42 డిజైన్లకు గాను ఇప్పటివరకు 14 డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించిందన్నారు. మరో 16 డిజైన్లను సమర్పించడం జరిగిందన్నారు. ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో ఇప్పటివరకు 8 ప్రాజెక్టులు ప్రారంభించామని మంత్రి తెలిపారు. మరో 5 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇవేకాక, మరో 15 ప్రాజెక్టులు ఈ ఏడాది జూన్ 15 నాటికి సిద్ధం కానున్నాయన్నారు.
‘కెల్లర్’కు విశ్వకర్మ అవార్డు
పోలవరం గ్రౌండ్ ఇంజనీరింగ్ పనులు చేపట్టిన కెల్లర్ గ్రౌండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ‘సీఐడీసీ విశ్వకర్మ అవార్డు-2018’ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.