బిజినెస్

మోడల్ జిఎస్‌టిపై నేడు ఆర్థిక మంత్రుల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 13: వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సుధీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రాజ్యసభలో ఆమోదం పొందగలదన్న ఆశాభావం మధ్య మోడల్ జిఎస్‌టి చట్టంపై చర్చించేందుకు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశం అవుతున్నారు. రెండు రోజులపాటు కోల్‌కత్తాలో జరిగే ఈ సమావేశం మంగళవారం మొదలవుతోంది. ఇందులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా పాల్గొంటున్నారు. ఇదిలావుంటే రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందితే, వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకువస్తామని, అదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు.