బిజినెస్

ఎయిర్ ఇండియాకు కేంద్రం రూ.325 కోట్ల బకాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12: కేంద్రం ఎయిర్ ఇండియాకు చెల్లించాల్సిన బకాయిలు అక్షరాలా రూ.325 కోట్లు. అసలే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాకు కేంద్రం బకాయి పడటం విచిత్రమే మరి. ఆర్‌టిఐ కార్యకర్త, పదవీ విరమణ చేసిన నేవీ అధికారి కమ్మోడోర్ లోకేష్ బట్రా సమాచార హక్కు కింద ఎయిర్ ఇండియాకు రావాల్సిన బకాయిల వివరాలు తెలియజేయాలని కోరారు. దీంతో ఈ విషయం బయటపడింది. వీవీఐపీలు విదేశాల పర్యటనకు వెళ్లినప్పుడు, ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లైట్లను ఉపయోగిస్తారు. ముఖ్యంగా రాష్టప్రతి, ఉపరాష్టప్రతి, ప్రధాని విదేశాల పర్యటనకు వెళ్లే సమయంలో ఎయిర్ ఇండియా తన వాణిజ్య విమానాలను, ఛార్టర్ జెట్స్‌గా మార్చి అందజేస్తుంది. రక్షణ, విదేశాంగశాఖ, ప్రధాని కార్యాలయం, కేబినెట్ సక్రెటేరియట్‌లు ఇందుకయ్యే బిల్లులను చెల్లిస్తుంటాయి. విచిత్రమేమంటే ఇప్పటి వరకు కేంద్రం బకాయి పడిన మొత్తంలో అధికంగా రూ.178.55 కోట్లు విదేశాంగ శాఖ చెల్లించాల్సి ఉండగా, రూ.128.84 కోట్లు కేబినెట్ సెక్రెటేరియట్, రక్షణ శాఖ రూ.18.42 కోట్లు బకాయి పడ్డాయి.
ఎయిర్ ఇండియా బిడ్డింగ్‌కు
ఎయిర్‌లైన్ కన్సార్టియం
జెట్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఫ్రాన్స్-కెఎల్‌ఎం విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా బిడ్డింగ్‌కు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే విపరీత నష్టాల్లో నడుస్తున్న ఎయిర్ ఇండియా సంస్థను ప్రైవేటు పరం చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు త్వరలోనే బిడ్డింగ్‌లను ఆహ్వానించి, ఈ ఏడాది లోగా ఎయిర్ ఇండియా వాటాలను అమ్మే అవకాశముంది. కంపెనీని మొత్తం నాలుగు భాగాలు చేసి అమ్మకం కొనసాగిస్తారు. ‘ది నేషనల్ కెరియర్’, ‘ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్’, ‘ఎఐఎస్‌ఏటీఎస్’లను ఒక విభాగం కింద, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను మరో విభాగం కింద ఉంటాయి. ఇక ఎయిర్ ఇండియా, ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్‌లను మరో రెండు విభాగాలుగా అమ్మకం సాగిస్తారు.