బిజినెస్

స్టాక్ మార్కెట్ల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 12: బీఎస్‌ఈ సెనె్సక్స్ నేడు 611 పాయింట్లు పెరిగి, 33,917.94 పాయింట్ల వద్ద ముగిసింది. యుఎస్ ఉద్యోగ నివేదిక సానుకూలంగా ఉండటంతో ప్రపంచ మార్కెట్లు మంచి లాభాల్లో కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లనుంచి సానుకూలత కనిపించిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లు జోరందుకున్నాయి. 2016, మార్చి 1 తర్వాత ఒకే రోజు ఇంతటి లాభాల్లో ట్రేడింగ్ కావడం ఇదే ప్రథమం.
లోహాలు, చమురు, చమురు-సహజవాయువు, ఎఫ్‌ఎంసీజీ, బ్యాకింగ్, విద్యుత్, వౌలిక సదుపాయాలు, ఐటీ, కేపిటల్ గూడ్స్ స్టాక్స్ రంగాల్లో మదుపర్లు ఉత్సాహంగా పెట్టుబడులు పెట్టారు. ఒకదశలో మార్కెట్ 33,962 పాయింట్లకు చేరినప్పటికీ, తర్వాత 33,917.94 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 10,433.65 పాయింట్లవద్ద ట్రేడింగ్ ముగిసింది. మొత్తం 194.55 పాయింట్లు ఎగబాకి 10,433.65 పాయింట్ల వద్ద ముగిసింది. భారతీ ఎయిర్‌టెల్ 4.68%, ఐటీసీ 4.09%, ఎన్‌టీపీసీ 4.33% చొప్పున లాభాలు నమోదు చేశాయి. ఇంకా టాటా స్టీల్, యాక్సిస్ మ్యాంక్, ఎస్ బ్యాంక్, ఆదాదాని పోర్ట్స్, ఓఎన్‌జీసీ, విప్రో, ఇండస్‌లాండ్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్, ఆర్‌ఐఎల్, హెచ్‌యుఎల్, ఎల్ అండ్ టి, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్‌ల షేర్లు లాభాలు నమోదు చేశాయి.