బిజినెస్

తెలంగాణకు మరో జపాన్ కంపెనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: తెలంగాణకు మరో కంపెనీ రానుంది. జపాన్‌కు చెందిన ఇసే పూడ్స్ యూనిట్‌ను సిద్ధిపేట జిల్లాలోని నంగనూర్‌లో 140 ఎకరాల విస్ణీర్ణంలో నెలకొల్పనుంది. ఈ మేరకు ఆ కంపెనికి ప్రభుత్వపరంగా ఇచ్చే రాయితీలు, అనుమతి పత్రాలను సోమవారం పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి అందజేసారు. నంగనూర్‌లో ఏర్పాటు చేయనున్న యూనిట్‌లో కోడి గుడ్ల ప్రాసెసింగ్‌తో పాటు కోళ్ల ఫామ్‌లో లభించే వ్యర్ధలతో సేంద్రీయ ఎరువులను తయారు చేయనుంది. ఫౌల్ట్రీ టెక్నాలజీలో శిక్షణ ఇచ్చేందుకు ఇక్కడి నుంచి విద్యార్థులను జపాన్‌కు తీసుకెళ్లనుందని మంత్రి కెటిఆర్ తెలిపారు. దీంతో పాటు సుజుకి కంపెనీ భాగస్వామ్యంతో లిధియం అయాన్ బ్యాటరీల రిసర్చ్ అండ్ డవలప్‌మెంట్ కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయనుందన్నారు. పౌల్ట్రీ పరిశ్రమతో పాటు మొక్కజొన్న పంట సాగు చేసే రైతులకు లాభదాయకం కానుందని మంత్రి అన్నారు.

చిత్రం.. సిద్దిపేట జిల్లా నంగునూర్‌లో స్థాపించనున్న జపాన్ కంపెనీకి అనుమతి పత్రాలను అందజేస్తున్న
మంత్రులు కెటిఆర్, ఈటల, మహేందర్‌రెడ్డి