బిజినెస్

బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిరిండియాల పనితీరు అధ్వాన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 13: 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ ఆయిల్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీలు అత్యధిక లాభాలను నమోదు చేయగా, బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్ ఇండియా, ఎంటిఎన్‌ఎల్‌లు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయని కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే స్పష్టం చేసింది.
2016-17లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై నిర్వహించిన సర్వే నివేదికను మంగళవారం ప్రభుత్వం పార్లమెంట్ ముందుంచింది. దీని ప్రకారం నష్టాల్లో ఉన్న 82 సంస్థల్లో 83.82 శాతం నష్టాలు కేవలం తొలి 10 స్థానాల్లో ఉన్న నష్టదాయక సంస్థలనుంచే వాటిల్లుతున్నాయని సర్వే స్పష్టం చేసింది. నష్టాల్లో ఉన్న తొలి పది సంస్థల మొత్తం నష్టంలో, బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్ ఇండియా, ఎంటిఎన్‌ఎల్ సంస్థల వాటా 55.66 శాతం. ఇక లాభాల్లో తొలి పది స్థానంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, కోల్ ఇండియా లిమిటెడ్‌ల లాభాల వాటా వరుసగా 19.69%, 18.45%, 14.94%. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్‌లు లాభాల్లో తొలి పది స్థానాల్లో ఉన్న సీపీఎస్‌ఈల్లో చోటు సంపాదించాయి. కాగా హిందుస్థాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లు తొలి పది స్థానాలనుంచి వైదొలిగాయి. 2016-17లో మొత్తం లాభాలు ఆర్జించే 174 సీపీఎస్‌యూల్లో, అగ్రస్థానంలో ఉన్న పది సంస్థల వాటా 63.57 శాతం. హిందుస్థాన్ కేబుల్స్, బీహెచ్‌ఈఎల్, ఓఎన్‌జీసీ విదేశ్ లిమిటెడ్ సంస్థలు 2015-16లో నష్టాలను చవిచూసినా, 2016-17లో కోలుకొని లాభాల బాటపట్టాయి.
ఇక వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, ఎస్‌టీసీఎల్, ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్, బ్రహ్మపుత్ర క్రాకర్స్ అండ్ పాలిమర్ లిమిటెడ్‌లు నష్టాల్లో తొలి పది సంస్థల్లో చేరిపోయాయి. 2016-17లో దేశవ్యాప్తంగా మొత్తం 257 ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్జించిన లాభం రూ.1,27,602 కోట్లు. అంతకుముందు ఏడాది నమోదైన రూ.1,14,239 కోట్ల కంటే ఇది అధికం. అంటే లాభాల్లో 11.7 శాతం వృద్ధి నమోదైంది.