బిజినెస్

వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు తగిన మద్దతిచ్చే రీతిలో ప్రణాళికలను రూపొందించాలని, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు పౌర విమానయాన మంత్రిత్వశాఖ అధికార్లను కోరారు. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న ఆయన పౌర విమానయాన శాఖ అదనపు బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విధానానికి సంబంధించి రూపొందించిన ముసాయిదాను, అభిప్రాయాల కోసం ఇతర మంత్రిత్వశాఖలకు పంపామని మంత్రి తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను మరింత వేగంగా రవాణా చేసేందుకు కార్గో సర్వీసులు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. ఇక్కడి ప్రగతి మైదాన్‌లో ఇంటర్నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ హాస్పిటాలిటీ ఈవెంట్‌ను మంగళవారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐటి, పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాలతో సహా 12 ఛాంపియన్ సర్వీస్ సెక్టార్‌లకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు. ఒక్కసారి వీటికి అవసరమైన నిధుల కేటాయింపు జరిగితే, రంగాల వారీగా మద్దతు ఇచ్చే ప్రణాళికల రూపకల్పన జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి రంగానికి ఒక సమగ్రమైన ప్రణాలికను రూపొందిస్తున్నామన్నారు. దీనివల్ల ఆయా రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.
మరో ప్రత్యేక కార్యక్రమంలో పాల్కొన్న సందర్భంగా ఆయన, మేధో సంపత్తి హక్కులకు సంబంధించిన చట్టాలను పోలీసులు సమర్థవంతంగా అమలు పరచేందుకు వీలుగా, సరైన మాడ్యూల్‌ను తయారు చేయాలని, ఆయన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపిపి)కి చెందిన అధికార్లను ఆదేశించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధ్యక్షుడు సిద్దార్థ్‌రాయ్ కపూర్ మాట్లాడుతూ, పైరసీని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఐటీ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక సైబర్ క్రైమ్ సెల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. యూరోపియన్ యూనియన్‌కు చెందిన భారత రాయమారి తొమాస్జ్ కోజ్‌లోవిస్కీ మాట్లాడుతూ సృజనాత్మకతను ప్రోత్సహించడంలో మేధోసంపత్తికి సంబంధించిన చట్టాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.