బిజినెస్

జీఎస్టీ చెల్లింపుల్లో వ్యత్యాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18 : జీఎస్టీ కింద సమ్మరీ రిటర్న్స్‌లో కేవలం 16 శాతం మాత్రమే తుది రిటర్న్స్ సరిపోవడంతో ఆదాయపుపన్ను శాఖ అప్రమత్తమైంది. ఏదశలోనైనా పన్ను ఎగవేతకు ఆస్కారమున్నదేమోనన్న అంశాన్ని పరిశీలిస్తోంది. జిఎస్‌టీ రిటర్న్స్ డేటా ప్రకారం, ఈ ఏడాది జూలై-డిసెంబర్ మధ్య కాలానికి సంబంధించి మొత్తం వ్యాపారాల్లో 34 శాతం తొలి సమ్మరీ రిటర్న్ (జీఎస్‌టీఆర్-3బి) ఫైల్ చేసే సమయంలో రూ.34,400 కోట్ల మేర తక్కువ పన్ను చెల్లించాయి. ఈ 34 శాతం వ్యాపారాలు, జిఎస్‌టిఆర్-3 కింద చెల్లించిన మొత్తం రూ.8.16 లక్షల కోట్లు. మరి ఇదే జిఎస్‌టిఆర్-1 సమాచారం ప్రకారం ఈ వ్యాపారాలు చెల్లించాల్సిన మొత్తం పన్ను రూ.8.50 కోట్లు ఉండాలని అంచనా వేసింది. ఆదాయపు పన్ను శాఖ గణాంకాల ప్రకారం, వ్యాపారాల్లో 16.36 శాతం తొలినాళ్లలో చెల్లించిన పన్ను, వాటి తుది రిటర్న్స్ మరియు పన్ను బకాయికి సరిపోయింది. ఇవి మొత్తం రూ.22,014 కోట్లు చెల్లించాయి. కాగా జీఎస్‌టీ కింద జూలై-డిసెంబర్ మధ్యకాలంలో నమోదైన వ్యాపారాల్లో 49.36 శాతం రూ.91,072 కోట్ల మేర అదనంగా పన్ను చెల్లించాయి.
2017-18 జూలై-డిసెంబర్ మధ్యకాలంలో దేశంలోని 51.96 లక్షల వ్యాపారాలు చెల్లించిన మొత్తం వస్తు సేవల పన్నును ఆదాయపు పన్ను శాఖ విశే్లషించింది.