బిజినెస్

రూ. 52వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: అత్యంత విలువయిన పది కంపెనీల మొత్తం మార్కెట్ విలువ శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో రూ. 52వేల కోట్లకు పైగా తగ్గిపోయింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వీటిలో అత్యధికంగా నష్టపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐల మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పడిపోయింది. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, మారుతి సుజుకి ఇండియా, ఇన్ఫోసిస్‌లు ఈ వారంలో లాభపడ్డాయి. టీసీఎస్ మార్కెట్ విలువ (ఎం-క్యాప్) రూ. 40,008.61 కోట్లు పడిపోయి, రూ. 5,40,881 కోట్లకు దిగజారింది. రిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 7,316.53 కోట్లు తగ్గి, రూ. 5,70,435.32 కోట్లకు చేరింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) మార్కెట్ విలువ రూ. 2,887.48 కోట్లు తగ్గి, రూ. 2,27,661.59 కోట్లకు పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ విలువ రూ. 989.2 కోట్లు పడిపోయి, రూ. 2,99,893.64 కోట్లకు తగ్గింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 474.76 కోట్లు తగ్గి, రూ. 2,18,045.68 కోట్లకు చేరింది. హిందుస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) మార్కెట్ విలువ రూ. 324.67 కోట్లు తగ్గి, రూ. 2,81,190.10 కోట్లకు పడిపోయింది.
మరోవైపు, ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ. 1,987.55 కోట్లు పుంజుకొని, రూ. 2,56,087.40 కోట్లకు పెరిగింది. ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1,577.79 కోట్లు పెరిగి, రూ. 3,17,976.53 కోట్లకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 1,115.32 కోట్లు పుంజుకొని, రూ. 4,81,791.07 కోట్లకు చేరింది. మారుతి సుజుకి ఇండియా మార్కెట్ విలువ రూ. 782.38 కోట్లు పెరిగి, రూ. 2,62,518.14 కోట్లకు చేరుకుంది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఈ వారంలో 131.14 పాయింట్లు పడిపోయి, 33,176 పాయింట్ల వద్ద ముగిసింది. పది అత్యంత విలువయిన కంపెనీల మార్కెట్ విలువ ర్యాంకింగ్‌లో రిల్ అగ్ర స్థానంలో నిలువగా, టీసీఎస్ రెండో స్థానంలో నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్, మారుతి సుజుకి ఇండియా, ఇన్ఫోసిస్ ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐలు వరుసగా తరువాత స్థానాలను ఆక్రమించాయి.