బిజినెస్

అయిదోరోజూ పతనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 19: దేశ కరెంటు ఖాతా లోటు (సీఏడీ) పెరగడంతో పాటు అమెరికాలో వడ్డీ రేటు పెరుగుతుందనే భయాందోళనలతో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్‌లో లోహ, టెలికం, బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో మార్కెట్ కీలక సూచీలు పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 253 పాయింట్లు పడిపోయి, కీలకమయిన 33,000 స్థాయికన్నా దిగువకు దిగజారింది. సెనె్సక్స్ ఇలా పతనం కావడం ఇది వరుసగా అయిదో సెషన్. ఈ సూచీ 252.88 పాయింట్లు (0.76 శాతం) పడిపోయి, 32,923.12 పాయింట్ల వద్ద ముగిసింది. 2017 డిసెంబర్ 6న 32,597.18 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్ ఆ తరువాత ఇంత దిగువ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. ఈ సూచీ క్రితం నాలుగు సెషన్లలో కలిసి 741.94 పాయింట్లు పతనమయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా సోమవారం 10,100 పాయింట్ల స్థాయికన్నా దిగువకు పడిపోయింది. 100.10 పాయింట్లు పడిపోయిన ఈ సూచీ 10,094.25 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ వారంలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతుందని, తద్వారా బాండ్లపై ఆదాయం పెరుగుతుందనే అంచనాలతో విదేశీ ఫండ్‌లు తరలిపోవడం దేశీయ స్టాక్ మార్కెట్ నష్టపోవడానికి ఒక కారణంగా నిలిచింది. శుక్రవారం మార్కెట్ వేళలు ముగిసిన తరువాత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) విడుదల చేసిన గణాంకాలు డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో రెండు శాతానికి పెరిగి, 13.5 బిలియన్ డాలర్లకు చేరుకుందని వెల్లడించడంతో సోమవారం మొత్తం మీద మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగానే కనిపించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో సీఏడీ 1.4 శాతం ఉండింది. అధిక వాణిజ్య లోటు కారణంగా సీఏడీ పెరిగింది. ఇంట్రా-డేలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 19 పైసలు తగ్గి, 65.13కు చేరడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.
సోమవారం నాటి లావాదేవీల్లో సెనె్సక్స్ ప్యాక్‌లోని టాటా స్టీల్ అత్యధికంగా నష్టపోయింది. ఈ కంపెనీ షేర్ ధర 4.24 శాతం పతనమయింది. భారతి ఎయిర్‌టెల్ 4.16 శాతం నష్టంతో తరువాత స్థానంలో నిలిచింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో విప్రో, యెస్ బ్యాంక్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, ఆసియన్ పెయింట్, బజాజ్ ఆటో, అదాని పోర్ట్స్, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, హీరో మోటోకార్ప్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ లిమిటెడ్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంఅండ్‌ఎం ఉన్నాయి. వీటి షేర్ల విలువ 2.60 శాతం వరకు పడిపోయింది. ఇందుకు భిన్నంగా సెనె్సక్స్ ప్యాక్‌లోని పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, మారుతి సుజుకి, హిందుస్తాన్ యూనిలీవర్, టీసీఎస్ లాభాలు గడించాయి. వీటి షేర్ల ధర 1.12 శాతం వరకు పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బేస్ మెటల్స్ ధరలు పడిపోవడంతో మెటల్ కంపెనీల షేర్ల ధరలు దిగజారాయి. మెటల్ సెగ్మెంట్‌లో ఎన్‌ఎండీసీ, సెయిల్, హిండాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, హిందుస్తాన్ జింక్, వేదాంత వంటి కంపెనీలు నష్టపోయాయి. వీటి షేర్ల విలువ 6.47 శాతం వరకు పడిపోయింది.