బిజినెస్

ప్రపంచ వాణిజ్యానికి విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: అభివృద్ధి చెందిన దేశాలలో ప్రత్యేకించి అమెరికాలో పెరుగుతున్న స్వీయరక్షణ విధానాలపట్ల ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ రాబర్టో అజెవిడో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమెరికా ఉక్కు, అల్యూమినియంలపై అధిక దిగుమతి సుంకాన్ని విధించిన నేపథ్యంలో, ప్రపంచ వాణిజ్యం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు సభ్యదేశాలను ఆయన ఆహ్వానించారు. ఢిల్లీలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మినీ మంత్రివర్గ సమావేశానికి డబ్ల్యుటిఒ డైరెక్టర్ జనరల్ రాబర్టో అజెవిడో హాజరయ్యారు. ఈ సమావేశానికి 50 దేశాలనుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వీయరక్షణ విధానాల వల్ల పెరుగుతున్న ఎగుమతి ఆర్డర్లు, వాణిజ్య పరిమాణం దారుణంగా దెబ్బతినిపోతాయన్నారు. వాణిజ్య సంబంధ సమస్యల పరిష్కారానికి డబ్ల్యుటీఓ సభ్యదేశాలన్నీ కలిసికట్టుగా చర్చించి పరిష్కరించుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య వాతావరణం రిస్క్‌ను ఎదుర్కొంటున్నదన్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలుసుకున్నారు.‘‘మా ఎదుట ముఖ్యమైన సవాళ్లున్నాయి. మావద్ద వివాద పరిష్కార వ్యవస్థ కూడా ఉంది. అయితే ఇందుకు అవసరమైన అప్పిలేట్ సభ్యుల నియామకాలపై ఉన్న అడ్డంకులను తొలిగించేందుకు ఢిల్లీ సమావేశంలో చర్చిస్తాం’’ అన్నారు. డబ్ల్యుటిఒలో భారత శాశ్వత ప్రతినిధి జె.ఎస్. దీపక్‌తో ఆయన సమావేశం సందర్భంగా ప్రపంచీకరణ మరియి స్వేచ్ఛా వాణిజ్యంపై ప్రతిపాదనల నేపథ్యంలో నెలకొన్న పరిణామాలపై చర్చించారు. వాణిజ్యంలో వర్ధమాన దేశాలకు ప్రత్యేక సదుపాయం కల్పించాలన్న భారత్ డిమాండ్‌ను ఆయన సమర్ధించారు.

చిత్రం..ఢిల్లీలో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ రాబర్టో అజెవిడో