బిజినెస్

1.7 శాతానికి పెరుగుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ కరెంటు ఖాతా లోటు (సీఏడీ) స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో సుమారు 1.7 శాతానికి పెరుగుతుందని ఒక నివేదిక అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు అధికంగా ఉండటమే సీఏడీ పెరుగుదలకు ప్రధాన కారణమని పేర్కొంది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారతదేశ కరెంటు ఖాతా లోటు జీడీపీలో రెండు శాతానికి పెరిగిన నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాలకు కరెంటు ఖాతా లోటు అంచనాలను పెంచింది. ఈ ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం 2017-18 ఆర్థిక సంవత్సరానికి భారత దేశ కరెంటు ఖాతా లోటును పది బేసిస్ పాయింట్లు పెంచుతూ, జీడీపీలో 1.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అలాగే 2018-19 ఆర్థిక సంవత్సరానికి 20 బేసిస్ పాయింట్లు పెంచుతూ జీడీపీలో 1.9 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, భారత దేశ కరెంటు ఖాతా లోటు డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 1.4 శాతం పెరిగింది. ఈ మూడో త్రైమాసికంలో జీడీపీలో రెండు శాతానికి పెరిగిన కరెంటు ఖాతా లోటు 13.5 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే వాణిజ్య లోటు పెరగడం వల్లనే కరెంటు ఖాతా లోటు పెరిగింది. 2017 ఏప్రిల్- డిసెంబర్ మధ్య కాలంలో కరెంటు ఖాతా లోటు రెండింతలకు పైగా పెరిగి జీడీపీలో 1.9 శాతానికి పెరిగింది.