బిజినెస్

డబ్ల్యూటీఓను బలోపేతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ 20: ప్రపంచ వాణిజ్య సంస్థను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన ఉమ్మడి వేదికను గుర్తించాలని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేష్ ప్రభు సభ్యదేశాలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా డిసెంబర్‌లో జరిగిన బ్యూనోస్ ఎయిర్స్ మంత్రుల స్థాయి సమావేశంలో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో సురేష్‌ప్రభు చేసిన విజ్ఞప్తి ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా, చైనాతో సహా 52 దేశాల ప్రతినిధులు ఈ లాంఛన సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న స్వీయరక్షణ విధానాల నేపథ్యంలో భారత్ ఈ సమావేశానికి పిలుపునిచ్చింది. అంతేకాదు డబ్ల్యుటిఓను పునఃశక్తివంతం చేయడానికి అవకాశాలను అనే్వషించడం కూడా ఈ సమావేశ లక్ష్యాల్లో ఒకటి. ఈసందర్భంగా సురేష్ ప్రభు మాట్లాడుతూ, ‘‘బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ ఆర్థిక ప్రగతికి, అంతర్జాతీయ వాణిజ్యం, అభివృద్ధి, ఉపాధి కల్పనకు దోహదం చేసిందన్న సంగతి ఇక్కడ ఉన్నవారిలో చాలామందికి తెలుసు. మీకు డబ్ల్యుటిఒ విలువ తెలిసినట్లయితే, దాన్ని బలోపేతం చేసేందుకు ఉమ్మడిగా కృషిచేయాయన్న అంశాన్ని మీరు అంగీకరిస్తారు. ఏ చర్య తీసుకోకుండా ఉండటం అనేది ఎవరి ఐచ్ఛికం కారాదు’’ అన్నారు. డబ్ల్యుటిఓలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అవసరమైన రాజకీయ మార్గర్శనం చేయాలని సభ్యదేశాలను కోరారు. గత మంత్రివర్గస్థాయి సమావేశంలో, ఇటువంటి రాజకీయ మార్గదర్శనం లేనందువల్లనే ప్రతిష్ఠంభన ఏర్పడిందన్నారు. కార్యక్రమాల్లో పతిష్ఠంభన నెలకొన్నచోట ఉమ్మడి రాజకీయ మార్గదర్శనం అవసరమవుతుందన్నారు.