బిజినెస్

ఐడిబిఐ బ్యాంకును ప్రైవేటీకరించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 24: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడిబిఐ) ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి స్పష్టం చేసింది. దేశంలో బ్యాంకింగ్ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంఘం బుధవారం జైట్లీతో సమావేశమై ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణ అంశం గురించి చర్చించింది. ఈ విషయమై తమ అభిప్రాయాలతో పాటు ఐడిబిఐ బ్యాంకు ప్రైవేటీకరణను వ్యతిరేకించడానికి గల కారణాలను ఈ సమావేశంలో జైట్లీకి వివరించామని ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్.వెంకటాచలం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత కొద్ది సంవత్సరాల నుంచి మొండి బకాయిలు గణనీయంగా పెరిగిపోవడంతో ఐడిబిఐ బ్యాంకు అల్లాడుతోందని, ప్రస్తుతం ఆ బ్యాంకు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇదే ప్రధాన కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిందిగా జైట్లీకి విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు. అలాగే ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)కు అనుబంధంగా పనిచేస్తున్న బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా జైట్లీకి ఎఐబిఇఎ సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించింది. ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలతో పాటు ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఎస్‌బిఐ ఉల్లంఘిస్తుండటం, ఉద్యోగులపై ఏకపక్షంగా సర్వీసు నిబంధనలను రుద్దుతుండటం తదితర అంశాల గురించి ఈ సమావేశంలో అరుణ్ జైట్లీకి వివరించాం. వీటిపై మా అభిప్రాయాలను తెలియజేసి ఎస్‌బిఐ నుంచి అనుబంధ బ్యాంకులను విడదీయాల్సిన అవసరం ఉందని ఆయనకు స్పష్టం చేశాం’ అని వెంకటాచలం తెలిపారు. అన్ని వివరాలతో తాము సమర్పించిన వినతి పత్రాన్ని జైట్లీ క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. జైట్లీతో సమావేశమైన వారిలో వెంకటాచలంతో పాటు ఎఐబిఇఎ కార్యదర్శి బిఎస్.రాంబాబు, ఉపాధ్యక్షులు జెపి.శర్మ, ఎన్.వేణుగోపాల్, సంయుక్త కార్యదర్శి డిడి.రుస్తాగీ తదితరులు ఉన్నారు.