బిజినెస్

గ్రీన్ సిటీగా శ్రీసిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు, మార్చి 21: దేశంలోనే శ్రీసిటీ గ్రీన్‌సిటీగా గుర్తింపు పొందిందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యక్షులు బిఎస్‌ఎస్ ప్రసాద్ అన్నారు. బుధవారం ఆయన శ్రీసిటీని సందర్శించారు. అనంతరం బిజినెస్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో గ్రీన్‌సిటీగా శ్రీసిటీ గుర్తింపు పొంది ఇండియన్ గ్రీన్‌బిల్డింగ్ కౌన్సిల్ గోల్డ్ రేటింగ్ అవార్డు దక్కించుకుందని ఆయన ప్రశంసించారు. వివిధ పరిశ్రమలకు సంబంధించి కాలుష్యనియంత్రణా చర్యలను సమీక్షించిన ఆయన శ్రీసిటీ పరిశ్రమలు, ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తుందని కితాబిచ్చారు. కాలుష్యనియంత్రణా మండలి నిబంధనల్లో మార్పులు, చేర్పులను గురించి ఈ సందర్భంగా ఆయన సమావేశంలో పాల్గొన్న హెచ్ ఆర్ మేనేజర్లు, సేప్టే మేనేజర్లకు వివరించారు. శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ పచ్చదనం-పరిశుభ్రత, పర్యావరణ హిత ప్రమాణాలతో శ్రీసిటీని నిర్మించామన్నారు.దేశంలో ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ అవార్డు పొందిన అతికొద్ది గ్రీన్‌ఫీల్డ్ నగరాల్లో శ్రీసిటీ ఒకటన్నారు.