బిజినెస్

మళ్లీ వాణిజ్య యుద్ధ భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 22: వరుసగా రెండు రోజుల పాటు లాభాలు గడించిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం బలహీనపడ్డాయి. ప్రపంచ వాణిజ్య యుద్ధ భయం మళ్లీ తెరపైకి రావడంతో పాటు ఐరోపా మార్కెట్లు నష్టపోవడం వల్ల అప్రమత్తంగా వ్యవహరించిన మదుపరులు దేశీయ మార్కెట్లలో స్థిరాస్తి, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజి, వాహన, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణకు పూనుకున్నారు. దీంతో మార్కెట్ కీలక సూచీలు పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 130 పాయింట్లు దిగజారింది. 33,206.99 పాయింట్ల అధిక స్థాయి వద్ద ప్రారంభమయిన ఈ సూచీ మరింత ముందుకు సాగుతూ ఇంట్రా-డేలో 33,281.77 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరింది. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై కొత్తగా ఆంక్షలు విధించడానికి కసరత్తు చేస్తున్నారని వచ్చిన వార్తలతో మధ్యాహ్నం తరువాత మార్కెట్ ప్రతికూల ధోరణిలోకి వెళ్లిపోయి, 32,963.31 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే ఈ సూచీ 129.91 పాయింట్లు (0.39 శాతం) పతనమయి, 33,006.27 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంకింగ్ షేర్ల ధరలు పడిపోవడంతో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా గురువారం 40.50 పాయింట్లు (0.39 శాతం) పడిపోయి, 10,114.75 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఈ సూచీ 10,207.85- 10,105.40 పాయింట్ల మధ్య కదలాడింది.
గురువారం సెషన్ తొలుత సాధించిన లాభాలను కీలక సూచీలు నిలుపుకోలేకపోయాయి. స్థిరాస్తి, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజి, వాహన, ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటీ, పవర్, బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడం వల్ల కీలక సూచీలు పతనమయ్యాయి. వీక్లీ డెరివేటివ్‌ల గడువు ముగియడం వల్ల బ్యాంకింగ్ షేర్లు మరోసారి అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ల విలువ 2.62 శాతం వరకు పడిపోయింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో విప్రో, ఎంఅండ్‌ఎం, మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డీస్, అదాని పోర్ట్స్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్, కోల్ ఇండియా, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్ గ్రిడ్, హీరో మోటోకార్ప్, ఐటీసీ, టాటా స్టీల్, హెచ్‌యూఎల్ ఉన్నాయి. వీటి షేర్ల ధర 2.32 శాతం వరకు పడిపోయింది. మరోవైపు, ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, రిల్, సన్ ఫార్మా, ఆసియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీలు సానుకూల జోన్‌లో ముగిశాయి. వీటి షేర్ల విలువ 2.45 శాతం వరకు పుంజుకుంది. బ్రాడర్ మార్కెట్లలో కూడా షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.05 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.75 శాతం పడిపోయింది.