బిజినెస్

సేవల ఎగుమతికి ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: వివిధ సేవలను మరింత ప్రోత్సహించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉన్నదని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు స్పష్టం చేశారు. వాణిజ్య ఎగుమతులకంటే ఇవి వేగంగా వృద్ధి చెందడమే కాకుండా, మొత్తం దేశ ఎగుమతులు మరింతగా పెరగడానికి దోహదం చేస్తాయన్నారు. ‘‘నిజానికి గత కొద్ది సంవత్సరాలుగా మన ఎగుమతులు పెరుగుతున్నాయి. అయితే సంప్రదాయిక ఎగుమతులతోపాటు, సరికొత్త ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి కృషి చేయాలి’’ మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 12 సేవలను ప్రముఖ సేవారంగాలుగా గుర్తించి వాటి ప్రోత్సాహానికి రూ.5000 కోట్లు కేటాయించినట్టు ఇక్కడి క్యాప్ ఇండియా ఈవెంట్‌లో పాల్గొన్న సందర్భంగా మంత్రి వెల్లడించారు. వీటిలో ఐటీ, టూరిజం, హాస్పిటాలిటీ రంగాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం వల్ల దేశ ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతి రంగాన్ని దేశీయంగా, అంతర్జాతీయంగా అభివృద్ధి పరచేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్టు ఆయన తెలిపారు. సేవారంగం ఆర్థిక పురోభివృద్ధికి దోహదం చేస్తుంది కనుక పరిశ్రమలు కూ తమ సేవల పంపిణీలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించేందుకు కృషి చేయాలన్నారు. దేశంలో రసాయన ఉత్పత్తుల రంగం వృద్ధికి అనేక అవకాశాలున్నాయంటూనే ఎగుమతుల డిమాండ్ తట్టుకోవడానికి అనువైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న రసాయన పరిశ్రమల విలువ 147 బిలియన్ డాలర్లు గాగా, 2025 నాటికి ఇది రెట్టింపునకు అంటే 300 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశాలున్నాయి.