బిజినెస్

సీఎం హామీలు.. చకచకా అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగరేణి యాజమాన్యం వెల్లడి
హైదరాబాద్, మార్చి 23: సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలకు యాజమాన్యం తక్షణ ఆదేశాలు జారీ చేసి, అమలు చేస్తోంది. సింగరేణి ఎన్నికల అనంతరం గత నెల 27న శ్రీరాంపూర్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ కారుణ్య నియామకాలు, రిటైర్డ్ ఉద్యోగులకు వైద్యం, కొత్త క్వార్టర్ల నిర్మానం వంటి హామీలను ఇచ్చారు. కాగా వాటిపై వారం రోజుల్లోపే సర్య్కూలర్లను జారీ చేసి సం బంధిత ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు జరిపి అమలు చేస్తున్నారు. అతి ముఖ్యమైన కారుణ్య నియామకాల కోసం మార్చి 9న కొత్తగా మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తూ సర్క్యూలర్‌ను జారీ చేసింది. ఈ బోర్డు వచ్చే వారం నుంచి ఇకపై క్రమం తప్పకుం డా సమావేశాలు జరుపుతూ కారణ్య నియమకాల ప్రక్రియను వేగవంతం చేయనుంది. గనుల్లో పనిచేసే కార్మికులకు నీటి, విద్యుత్ బిల్లుల చెల్లింపు నుంచి పూర్తి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.