బిజినెస్

క్రీడలతో ఒత్తిడి నుంచి ఆటవిడుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఒత్తిడికి గురయ్యే ప్రజాప్రతినిధులకు ఆటవిడుపుగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శనివారం ఏపీ లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్-2018లో భాగంగా స్పీకర్ లెవన్ వర్సెస్ సీఎం లెవెన్ క్రికెట్ క్రీడా పోటీలు స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రాంతంలో తొలిసారిగా శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు మధ్య క్రీడా పోటీలు నిర్వహించుకుంటున్నామన్నారు. ఇటువంటి క్రీడా పోటీల్లో భాగస్వామ్యం కావడం ద్వారా మానసిక ఉల్లాసం కలగడంతోపాటు మరింతగా ప్రజాసేవ చేయడానికి ఒత్తిడి నుంచి దూరం కాగలుగుతామన్నారు. క్రీడల్లో భాగస్వామ్యం అయిన శాసనమండలి సభ్యులను, శాసనసభ్యులను అభినందిస్తున్నానన్నారు. క్రీడాశాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ వివిధ విభాగాల్లో క్రీడా పోటీలు, 27న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ మహిళా సభ్యులు కూడా క్రీడాంశాల్లో పాల్గొనడం వారి కోసం ప్రత్యేకంగా పోటీలను నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందిస్తున్నానన్నారు. మానసిక ఒత్తిడి నుంచి ప్రజా ప్రతినిధులు ఇటువంటి క్రీడాంశాల్లో పాల్గొనడం తప్పనిసరిగా ఉండాలన్నారు. సీఎం క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా కొల్లు రవీంద్ర వ్యవహరించారు. క్రికెట్ పోటీలో భాగంగా టాస్ గెలిచి స్పీకర్ టీమ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఆరు ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 42 పరుగులు సాధించింది. అనంతరం విజయ లక్ష్యం కోసం బ్యాటింగ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి లెవన్ టీమ్ 4.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 43 పరుగులను సాధించి 8 వికెట్ల తేడాతో స్పీకర్ లెవన్‌పై గెలుపొందింది.

సహకార బ్యాంకు పాలకవర్గం రద్దు
ఒంగోలు,మార్చి 24: ప్రకాశం జిల్లాకేంద్ర సహకార బ్యాంకు (డీసీసీ) పాలకవర్గాన్ని రద్దుచేస్తూ రాష్ట్రప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. పాలకవర్గం స్ధానంలో ఇన్‌చార్జిగా జిల్లాకలెక్టర్ వి వినయ్‌చంద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బ్యాంకు పాలకవర్గానికి మే 28వతేదీ వరకు గడువు ఉన్నప్పటికి నాటకీయ పరిణామాల నేపధ్యంలో రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా కర్షక వికాస రుణ పథకం కింద మంజూరైన రుణాల్లో భారీ అవకతవకలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన రాష్ట్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉప్పుగుండూరు బ్రాంచిలో సుమారు 80 లక్షల రూపాయల వరకు ఈ పథకం కింద అక్రమాలు జరిగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ప్రధానంగా ఈ శాఖలో భూములకు అధిక ధరలు కోడ్‌చేసి నగదును రైతులకు మంజూరు చేయటంతోపాటు పలు శాఖల్లోను ఆర్ధికపరమైన అంశాలను కోడ్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం పాలకవర్గాన్ని రద్దుచేసింది.