బిజినెస్

కళలనూ ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: సాంస్కృతిక శాఖకు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు చాలా తక్కువగా ఉంటున్నాయంటూ, కళాకారులను ప్రోత్సహించే నిమిత్తం క్రీడల మాదిరిగా వీరికి కూడా ప్రత్యేక సర్ట్ఫికెట్లు అందజేస్తూ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాలని శాసనసభ ప్రశ్నోత్తరాల్లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఒకటైన నేషనల్ కల్చర్ ఎక్ఛేంజ్ ఎందుకు చేపట్టటం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ పెనె్మత్స విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ విశాఖ పట్టణంలో రవీంద్రభారతి తరహాలో ఆడిటోరియం నిర్మాణానికి స్థలం కేటాయించి ఆ తర్వాత ఆ స్థలాన్ని ఓ ప్రైవేట్ కంపెనీకి ధారాదత్తం చేశారని ఉడా మినీ ఆడిటోరియంలో 4 గంటల కార్యక్రమానికి 70వేలు చార్జి వసూలు చేయడం దారుణమన్నారు. రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ టీవీలు, సినిమాలు, మీడియా ప్రభావంతో సాంప్రదాయ జానపద కళలకు ఆదరణ తగ్గిందన్నారు. ప్రభుత్వపరంగా ప్రాచీన కళలకు ప్రోత్సాహం కల్పించాలని కోరారు.