బిజినెస్

నాలుగోవారమూ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీగా పడిపోయిన కీలక సూచీలు ప579 పాయింట్లు తగ్గిన సెనె్సక్స్ప్ 212 పాయింట్లు దిగజారిన నిఫ్టీ పఈ వారం మార్కెట్ సరళిపై సమీక్ష

ముంబయి, మార్చి 24: ప్రపంచ వాణిజ్య యుద్ధ భయం శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీసింది. మార్కెట్ కీలక సూచీలు వరుసగా నాలుగో వారం భారీగా పతనమయ్యా యి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఈ వారంలో 579.46 పాయింట్లు పడిపోయి, అయిదు నెలల కనిష్ట స్థాయి అయిన 32,596.54 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ మానసికంగా కీలక స్థాయి అయిన పది వేల మార్కుకన్నా దిగువకు దిగజారి 9,998.05 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ వారమంతా దేశీయ స్టాక్ మార్కెట్‌పై బేర్‌లు పట్టుబిగించాయి. దీంతో అన్ని సూచీలు భారీగా పతనమయ్యాయి. పార్లమెంటు సమావేశాలలో నెలకొన్న ప్రతిష్టంభన, అమెరికాలో వడ్డీ రేట్ల పెరుగుదల, ప్రపం చ వాణిజ్య యుద్ధ భయం వంటి అంశాలు ఈ వారంలో మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. చైనా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయగానే వాణిజ్య యుద్ధ భయం వాస్తవరూపం దాల్చి, ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు నష్టపోయాయి. దీని ప్రభావంతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది.
అమెరికాలో ఎఫ్‌ఓఎంసీ సమావేశం జరుగనున్న తరుణంలో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితికి తోడు దేశ కరెంటు ఖాతా లోటు (సీఏడీ) పెరగడం వంటి అంశాల వల్ల ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. దీంతో అమ్మకాల ఒత్తిడి వల్ల కీలక సూచీలు పతనం కావడం, విలువ గల షేర్లను చేజిక్కించుకోవడానికి మదుపరులు పూనుకోవడంతో కాస్త పుంజుకోవడం వంటివి చోటు చేసుకున్నాయి. చైనా ఉత్పత్తుల దిగుమతులపై 60 బిలియన్ డాలర్ల మేరకు సుంకాలు విధించాలని ట్రంప్ నిర్ణయించడం, ప్రతీకారంగా అమెరికా దిగుమతులపై మూడు బిలియన్ డాలర్ల మేరకు సుంకాలు విధించడానికి కసరత్తు చేస్తున్నట్టు చైనా ప్రకటించడంతో వాణిజ్య యుద్ధ భయాలు వాస్తవరూపం దాల్చాయి.
సెనె్సక్స్ ఈ వారంలో 33,268.97 పాయింట్ల వద్ద ప్రారంభమయి, 33,354.93- 32,483.84 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 579.46 పాయింట్లు (1.75 శాతం) పడిపోయి, 32,596.54 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం మూడు వారాలలో కలిపి 966.15 పాయింట్లు (2.83 శాతం) పడిపోయింది. నిఫ్టీ ఈ వారం 10,215.35 పాయింట్ల వద్ద ప్రారంభమయి, 10,227.30- 9,951.90 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారం ముగింపుతో పోలిస్తే 211.58 పాయింట్లు (2.00 శాతం) పడిపోయి, 9,998.05 పాయింట్ల వద్ద స్థిరపడింది.
రంగాల వారీగా చూస్తే, స్థిరాస్తి, లోహ, పీఎస్‌యూలు, బ్యాంకులు, ఐపీఓ, చమురు- సహజ వాయువు, ఆరోగ్య సంరక్షణ, వాహన, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, టెక్నాలజి, ఎఫ్‌ఎంసీజీ, పవర్, కన్స్యూమర్ డ్యూరేబుల్స్ షేర్లు ప్రధానంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్ల విలువ కూడా గణనీయంగా పడిపోయింది. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐ) ఈ వారంలో నికరంగా రూ. 2,636.94 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఈ వారంలో 525.02 పాయింట్లు (3.24 శాతం) పడిపోయి, 15,694.11 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 775.26 పాయింట్లు (4.41 శాతం) పతనమయి, 16,801.18 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెనె్సక్స్ ప్యాక్‌లోని 27 కంపెనీల షేర్ల ధరలు పడిపోగా, మిగిలిన కంపెనీల షేర్ల ధరలు పెరిగాయి. యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, విప్రో, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, అదాని పోర్ట్స్, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, ఆసియన్ పెయింట్స్, భారతి ఎయిర్‌టెల్, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, మారుతి సుజుకి షేర్ల ధరలు ఈ వారంలో పతనమయ్యాయి. మరోవైపు, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ల ధరలు పెరిగాయి.