బిజినెస్

పరిహారం చెల్లింపులోనూ అంతులేని జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: రాష్ట్రంలో వివిధ కారణాలతో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల నివారణలోనూ, ఆపై పరిహారం చెల్లింపులోనూ అంతులేని జాప్యం జరుగుతున్నదంటూ శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో అద్దంకి శాసనససభ్యుడు గొట్టిపాటి రవికుమార్, పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కౌలు రైతుల గుర్తింపులోనూ తీవ్ర అన్యాయం జరుగుతున్నదని రవికుమార్ అన్నారు. ఆత్మహత్యలపై ప్రశ్నలు వేసిన వైకాపా సభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వి.రఘురామిరెడ్డి, నారాయణస్వామి సభలో లేకపోయినా టీడీపీ సభ్యులు వాడిగా వేడిగా విమర్శలు గుప్పించారు. వ్యవసాయ శాఖ తరపున పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమాధానమిస్తూ జిల్లాస్థాయి త్రిసభ్య కమిటీ నివేదికల ప్రకారం 2016లో 51, 2017లో 19 మొత్తం 70 ఆత్మహత్యలు జరిగాయని అన్నారు. రవికుమార్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో గత మూడేళ్లుగా రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. 119 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారుల లెక్కల ప్రకారం 38 మంది మాత్రమే ఉన్నారంటుంటే మంత్రి కలుగచేసుకుని కేవలం ఆరుగురే మరణించారని అన్నారు. రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షా 60వేల మంది కౌలు రైతులుంటే 20వేల మందికి మాత్రమే గుర్తింపు కార్డులు వచ్చాయని, ఆత్మహత్యల సమయంలో కార్డులు లేనివారికి తీరని అన్యాయం జరిగి ఆయా కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు. ఆత్మహత్యలు జరిగినప్పుడు డీఎస్‌పీ స్థాయి అధికారి వెళ్లాల్సి ఉండగా ఎస్‌ఐ స్థాయి అధికారులు వెళ్లటం వలన కూడా కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయని అన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ప్రభుత్వం ఐదు లక్షలు పరిహారంగా అందచేస్తున్నదని అయితే నిర్ధారణ అయితే కూడా ఏడాది వరకూ ఈ పరిహారం చేతికి రావటం లేదన్నారు. అప్పుల బాధలో ఆత్మహత్యలకు ప్రేరేపించే పరిస్థితులను నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 7 లక్షల మంది కౌలు రైతులకు రూ.2,697 కోట్లు రుణ సౌకర్యం కల్పించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి బ్యాంకర్ల సమావేశంలోనూ కౌలు రైతుల రుణ విషయం ప్రస్తావిస్తున్నారని అన్నారు. 2015లో 160 మంది ఆత్మహత్య చేసుకోగా 145 మందికి పరిహారం ఇచ్చామన్నారు.