బిజినెస్

అత్యుత్తమ ప్రమాణాలతో ఫార్మాసిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో ముచ్చర్లలో ఫార్మాసిటీని నెలకొల్పనున్నట్టు ఐటి, పరశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన పరిశ్రమల శాఖపై సుదీర్ఘంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు అనంతరం పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేశామని అన్నారు. కాలుష్యం వెదజల్లుతుందని మొత్తం పరిశ్రమనే వద్దనడం సరికాదని అన్నారు. ఫార్మా సంస్థల ద్వారా కాలు ష్యం వెదజల్లే మాట వాస్తవమేనని అయితే ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని నిరోధించవచ్చునని అన్నారు. సుమారు 19వేల ఎకరాల్లో ప్రపంచంలోనే మేటి సంస్థల సహకారంతో నిర్మిస్తున్న ఈ ఫార్మాసిటీలో నాలుగు లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉం దని అన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఫార్మాసిటీని అడ్డుకుంటామని బీజేపీ నేతలు అనడం విచారకరమని అన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగ కల్పనతో పాటు ప్రపంచంలోనే ఫార్మారంగంలో అగ్రస్థానంలో నిలిపేందుకు చేస్తున్న కృషికి అడ్డుపడతామనడం సరికాదని అన్నారు. ఇందులో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగాన్ని సైతం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని, ఇందులో భాగంగానే కాలుష్య కారకాలను వెదజల్లుతున్న 13 సంస్థలను మూసివేయించామని స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా గడిచిన మూడున్నర ఏళ్లలో 6200 యూనిట్లకు అనుమతులు ఇవ్వగా, 3200 యూనిట్లు ఇప్పటికే తమ కార్యకలాపాలు ప్రారంభించాయని చెప్పారు.
వంద శాతం పెరిగిన మైనింగ్ ఆదాయం
రాష్ట్రంలో మైనింగ్ ఆదాయం వంద శాతం పెరిగిందని అన్నారు. గతంలో రూ. 15వందల కోట్ల వరకు ఉన్న ఆదాయం ఇప్పుడు రూ. 3700 వరకు పెరిగిందన్నారు. అవినీతి అక్రమాలకు తావులేకుండా రాష్ట్రంలో మైనింగ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జాతీయ సంపద అయిన మినరల్స్ వల్ల వచ్చే ఆదాయం ఏ ఒక్క వ్యక్తి జేబుల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తున్నట్టు తెలిపారు. పరిమిత వనరుల నేపథ్యంలో పర్యావరణ హితంగా మైనింగ్ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. 1200 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేశామని, సిర్పుర్ కాగజ్‌నగర్ పరిశ్రమ తరహాలో బిల్డ్ పరిశ్రమను త్వరలోప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
రాష్ట్రంలో చేపడుతున్న నీటి పారుదల ప్రాజెక్టులతో వేలాది ఎకరాలు సాగులోకి వస్తుందని, దీంతో ఆయా ప్రాంతాల్లో పండే పంటను బట్టీ ఆగ్రో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రారంభించనున్నట్టు చెప్పారు. జిల్లాల వారీగా అక్కడ పండే పంటలను గుర్తించి అందుకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేయడం ద్వారా దేశంలోనే నెంబర్ వన్‌గా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పారు.