బిజినెస్

ఈ-వే బిల్లు వచ్చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అంతర్ రాష్ట్ర వస్తు రవాణాకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎలక్ట్రానిక్ వే బిల్లు (ఈ-వే బిల్లు)ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిం ది. రాష్ట్రాల మధ్య రూ. 50వేలకన్నా ఎక్కువ విలువ గల వస్తువుల రవాణా కు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ-వే బిల్లు తీసుకోవడం తప్పనిసరి. అలా గే, జూన్ వరకు సమ్మరి రిటర్న్ జీఎస్‌టీఆర్-3బీని దాఖలు చేయాల్సిన అవసరంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్-3బీని మరుసటి నెల 20వ తేదీలోపు దాఖ లు చేయవలసి ఉంటుం ది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన మార్చి 10వ తేదీన సమావేశమైన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండ లి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ-వే బిల్లు విధానాన్ని అమ లు చేయాలని, జీఎస్‌టీఆర్-3బీని దాఖలు చేసే సౌకర్యాన్ని జూన్ వరకు పొడిగించాలని నిర్ణయించిన విష యం తెలిసిందే. ప్రభు త్వం ఫిబ్రవరి ఒకటో తేదీ నుం చి ఈ-వే బిల్లు విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. రాష్ట్రం లోపల కూడా వస్తు రవాణాకు ఈ-వే బిల్లును పద్ధతిని ప్రవేశపెట్టవలసిన అవసరం ఉందని జీఎస్‌టీ మండలి నిర్ణయించింది. అంతర్ రాష్ట్ర వస్తు రవాణాకు ఈ-వే బిల్లు విధానాన్ని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభించినప్పటికీ, రాష్ట్రం లోపల వస్తు రవాణాకు ఈ-వే బిల్లు పద్ధతిని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దశలవారీగా ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ-వే బిల్లును ఎక్కడయినా జీఎస్‌టీ ఇన్‌స్పెక్టర్ అడిగితే చూపెట్టవలసి ఉంటుంది. దీనివల్ల పన్ను ఎగవేతలను నిరోధించవచ్చని జీఎస్‌టీ మం డలి భావించింది.
ప్రస్తుతం నగదు ప్రాతిపదికగా జరుగుతున్న వ్యాపా రం ఈ-వే బిల్లు విధానం వల్ల తగ్గుతుందని, పన్ను రాబడి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు ఈ-వే బిల్లు పద్ధతిని ప్రవేశపెట్టినందువల్ల ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వస్తు రవాణాదారులు తప్పనిసరిగా ఈ-వే బిల్లును తీసుకోవలసి ఉంటుంది.