బిజినెస్

ఫార్చ్యూన్ ఇండియా నెక్స్ట్-500 జాబితాలో జస్ట్ డయల్, యుటిఐకి స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 16: ఫార్చ్యూన్ ఇండియా నెక్స్ట్-500 సంస్థల జాబితాలో జస్ట్ డయల్, యుటిఐ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, ఐఆర్‌సిటిసిలకు చోటు లభించింది. ఈ జాబితాలో డైనమాటిక్ టెక్నాలజీస్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న కంపెనీల్లో చాలా సంస్థలు మధ్యస్థాయి పరిమాణం కలిగినవే. వీటిని ‘స్మాల్ వండర్స్’గా ఫార్చ్యూన్ పత్రిక అభివర్ణించింది. ఈ జాబితాలో డైనమాటిక్ టెక్నాలజీస్ 1,693 కోట్ల రూపాయల వార్షిక ఆదాయంతో అగ్రస్థానంలో నిలువగా, నెక్టార్ లైఫ్‌సైన్స్ (రూ.1,692 కోట్లు), ఓస్వాల్ ఉలెన్ మిల్స్ (రూ.1,689 కోట్లు), విఆర్‌ఎల్ లాజిస్టిక్స్ (రూ.1,682.5 కోట్లు), హిటాచీ హోమ్ అండ్ లైఫ్ సొల్యూషన్స్ (రూ.1,682.18 కోట్లు) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో నెక్టార్ లైఫ్‌సైన్స్‌కు కొత్తగా చోటు లభించగా, మరో నాలుగు సంస్థలు గత ఏడాది కంటే ర్యాంకులను మెరుగుపర్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకున్నాయి. నెక్స్ట్-500 జాబితాలో చోటు దక్కించుకున్న సంస్థల్లో వివిధ రంగాలకు చెందిన సంస్థలు ఉన్నాయని, వీటి సగటు ఆదాయం 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువగానూ, మొత్తం ఆదాయం రూ.5,14,788 కోట్లుగానూ ఉందని ఫార్చ్యూన్ పత్రిక వెల్లడించింది. ఈ జాబితాలోని తొలి పది స్థానాల్లో నిలిచిన ఇతర సంస్థల్లో గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, లూకాస్-టివిఎస్, గతి, అడెక్కో ఇండియా, జిందాల్ అల్యూమినియం ఉన్నాయి. గత ఏడాది ఈ జాబితాలో 328వ స్థానంలో నిలిచిన ఐఆర్‌సిటిసి ఈ ఏడాది 199వ ర్యాంకుకు ఎగబాకగా, ఈ ఏడాది ఈ జాబితాలో కొత్తగా చోటు దక్కించుకున్న యుటిఐ అసెట్ మేనేజ్‌మెంట్ 442వ స్థానంలోనూ, జస్ట్ డయల్ 449వ స్థానంలోనూ నిలిచాయి. ఇటీవల ఐపిఓ మార్కెట్లలోకి వచ్చిన నారాయణ్ హృదయాలయ, ఉజ్జీవన్ ఫైనాన్షిల్ సర్వీసెస్, డాక్టర్ లాల్ ప్యాథ్‌లాబ్స్, పరాగ్ మిల్క్ ఫుడ్స్ సంస్థలకు కూడా ఈ జాబితాలో చోటు లభించడం విశేషం.