బిజినెస్

ఫిక్కి-ఐఫా గ్లోబల్ ఫోరం మీట్‌కు స్పెయన్ వెళ్లనున్న కెటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16: స్పెయిన్‌లో ఈనెల 24న జరిగే ఫిక్కి-ఐఫా గ్లోబల్ బిజినెస్ ఫోరం సమావేశానికి తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావును ఆహ్వానించారు. ఈ సమావేశాల్లో జరిగే ప్యానల్ డిస్కషన్‌లో పాల్గొనాలని ఫిక్కీ నిర్వాహక బృందం కెటిఆర్‌ను కోరింది. ‘సినర్జీస్ ఇన్ ఐటి, స్మార్ట్‌సిటీ, టూరిజం ప్రమోషన్’ అనే అంశంపై ప్రసంగించాలని ఆయనను ఆహ్వానించారు. ఐఫా సినిమా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ప్రపంచంలోని వివిధ నగరాల్లో ప్రతి సంవత్సరం జరగుతున్న విషయం తెలిసిందే. ఈసారి స్పెయిన్ లోని మాడ్రిడ్‌లో జరిగే ఈ అవార్డుల కార్యక్రమంలో ప్రతి ఏడాది నిర్వహించినట్టుగానే బిజినెస్ ఫోరమ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఐటి, ఎలక్ట్రానిక్స్, సినిమా, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, రెనెవబుల్ ఎనర్జీ, పురపాలన, రహదారుల అభివృద్ధి వంటి రంగాల్లో చర్చలు జరుగుతాయి. దీనిలో ముఖ్యంగా ఐటి, టూరిజం సెషన్‌లో కెటిఆర్‌ను ప్రసంగించాలని కోరారు.
ఫిక్కీ జాతీయ సమావేశానికి ఆహ్వానం
ఫిక్కీ జాతీయ కార్యవర్గం సమావేశంలో ప్రసంగించాలని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావును ఆహ్వానించారు. ఫిక్కీ చైర్మన్‌గా ఎన్నికైన హర్షవర్థన్ నియోటియా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ప్రసంగించేందుకు కెటిఆర్‌ను ఆహ్వానించారు. జూలై నాలుగున హైదరాబాద్‌లో జరిగే ఈ సమావేశానికి దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, నిపుణలు వస్తారని ఈ సమావేశంలో తెలంగాణలోని వ్యాపార అవకాశాలపై ప్రసంగించమని కెటిఆర్‌ను కోరారు. తెలంగాణ ఫిక్కి చైర్ పర్సన్ సంగీతారెడ్డి కెటిఆర్‌కు ఆహ్వాన పత్రం అందజేశారు.

చిత్రం టి.ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు