బిజినెస్

ఇక ఉపాధి వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 3: దేశ ఆర్థిక వ్యవస్థ బలాన్ని సంతరించుకున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు, హైరింగ్ కార్యకలాపాలు గణనీయంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని తాజాగా జరిగిన ఓ సర్వేలో స్పష్టమైంది. ముఖ్యంగా తయారీ రం గం, టెక్నాలజీ, పునర్వినియోగ ఇంధనం తదితర రంగాల్లో వెల్లువెత్తనున్న అవకాశాల దృ ష్ట్యా ఈ హైరింగ్ అన్నది భారీగా పెరగవచ్చునని ఈ నివేదిక స్పష్టం చేసింది. 2017లో నమోదైన ఆర్థిక వృద్ధిరేటును పరిగణనలోకి తీసుకుని రానున్న కాలంలో వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఏవిధంగా పెరగబోతున్నాయన్నదానిపై ఈ నివేదిక పలు అంశాలను కళ్లకు కట్టింది. ముఖ్యంగా సామర్థ్యానికి నైపుణ్యానికి కీలక రంగాల్లో సముచిత ప్రాధాన్యం లభించే అవకాశాలు మెరుగుకానున్నాయని తెలిపింది. సానుకూల చర్యల ద్వారా భారత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అనేక కోణాల్లో బలోపేతం చేయడంతోపాటు ఉపాధి అవకాశాలను పెంపొందించే మార్గాలను విస్తరిస్తు న్న దృష్ట్యా సానుకూల వాతావరణం బలపడుతోందని ఈ నివేదిక తెలిపింది. దాదాపు అ న్ని రంగాల్లోనూ గుణాత్మకమైన పరిణామా లు బలపడేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వ ప్రో త్సాహక చర్యల కారణంగా అనేక విదేశీ కంపెనీలు కూడా భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని, ముఖ్యంగా తయారీ రంగంలో క్రియాశీలక భూమికను పోషించేందుకు సన్నద్ధతను కనబరుస్తున్నాయని నివేదిక తెలిపింది. ఇప్పటివరకు అంది న వివరాలు విదేశీ కంపెనీల నుంచి వచ్చిన ఆసక్తిని పరిగణనలోకి తీసుకుంటే తయారీ రంగం, టెక్నాలజీ, పునర్వినియోగ ఇంధన రంగాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కచ్చితంగా టెక్నాలజీ రంగంలోనూ, తయారీ రంగంలోనూ ప్రతిభ ఆధారిత నియామకాలు గణనీయంగా పెరిగేందుకు మార్గాలు ఉన్నాయని తెలిపింది. అ మ్మకాలు, మార్కెటింగ్ రంగాల్లో కూడా ఉ పాధి విస్తృతమవుతుందని, ముఖ్యంగా నైపు ణ్యం, మాటకారితనం, ఎదుటివారిని ఆకట్టుకోగలిగే సామర్థ్యం కలిగిన వ్యక్తులు ఈ రం గంలో తమ ప్రతిభను నిరూపించుకుని రా ణించే అవకాశం ఉందని తెలిపింది. వినియో గ, డిజిటల్, అమ్మకాల ప్రోత్సాహక రంగాల్లో అవకాశాలు భారీగా పెరగవచ్చునని మైఖేల్ ఫేజ్ అనేక నియామక సంస్థ వెల్లడించింది.