బిజినెస్

దెబ్బతీసిన వాణిజ్య యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: అమెరికా, చైనాలు పరస్పరం దిగుమతి సుంకాలను భారీగా పెంచుకోవడంతో వాణిజ్య యుద్ధ భయాలు తీవ్రమై ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడిపోయిన ప్రతికూల పరిణామాలతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా భారీగా నష్టపోయాయి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన సమీక్ష నిర్ణయాలు వెలువడనుండటంతో దేశీయ మదుపరులు కూడా తమ పోర్ట్ఫోలియోలను విస్తరించుకోవడం పట్ల విముఖత చూపారని బ్రోకర్లు పేర్కొన్నారు. అమెరికా చర్యకు ప్రతీకారంగా 106 అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై కొత్త దిగుమతి సుంకాలను విధిస్తూ చైనా బుధవారం తీసుకున్న నిర్ణయంతో ప్రపంచంలోనే ఈ రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వాణిజ్య యుద్ధానికి చేరువయ్యాయి. ఈ పరిణామంతో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతిని ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపైనా పడింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ బుధవారం సానుకూల స్థాయి వద్ద ప్రారంభమయి, తరువాత మరింత పుంజుకొని ఇంట్రా-డేలో 33,505.53 పాయింట్లకు చేరింది. అయితే, మధ్యాహ్నం తరువాత ఒక్కసారిగా పడిపోయి, 32,972.56 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 351.56 పాయింట్ల (1.05 శాతం) నష్టంతో 33,019.07 పాయింట్ల వద్ద ముగిసింది. మార్చి 23న 409.73 పాయింట్లు పడిపోయిన సెనె్సక్స్ ఆ తరువాత ఇంత భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ బుధవారం ఇంట్రా-డేలో 10,279.85 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకినప్పటికీ, ఆ తరువాత ప్రతికూల ధోరణిలోకి జారిపోయి, 10,111.30 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 116.60 పాయింట్ల (1.14 శాతం) నష్టంతో 10,128.40 పాయింట్ల వద్ద ముగిసింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రెండు రోజుల సమావేశం బుధవారం ప్రారంభం అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఎంపీసీ నిర్ణయం తీసుకుంటుందనే ఆశలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) మంగళవారం నికరంగా రూ. 376.51 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు రూ. 479.18 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.
బుధవారంనాటి లావాదేవీల్లో సెనె్సక్స్ ప్యాక్‌లోని టాటా స్టీల్ అత్యధికంగా 3.29 శాతం నష్టపోయింది. యాక్సిస్ బ్యాంక్ 2.61 శాతం నష్టంతో తరువాత స్థానంలో నిలిచింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో ఎల్‌అండ్‌టీ, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ కోటక్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, భారతి ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, సన్ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, కోల్ ఇండియా, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, ఆసియన్ పెయింట్స్, ఓఎన్‌జీసీ, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, రిల్, మారుతి సుజుకి ఉన్నాయి. వీటి షేర్ల విలువ 2.52 శాతం వరకు పడిపోయింది. టాటా మోటార్స్ అత్యధికంగా 3.60 శాతం లాభపడింది. లాభపడిన ఇతర సంస్థల్లో జేఎల్‌ఆర్ ఇండియా, హీరో మోటాకార్ప్ ఉన్నాయి.