బిజినెస్

రెండోవారమూ బలపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోవారం లాభపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో 658.29 పాయింట్లు పుంజుకొని, 33,626.97 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కీలకమయిన 10,300 స్థాయికి పైన 10,331.60 పాయింట్ల వద్ద స్థిరపడింది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య పోరు కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, ద్రవ్య విధానాన్ని యథాతథంగా కొనసాగించాలన్న రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు పుంజుకుంటుందన్న అంచనా వంటి దేశీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలతో మదుపరులు దూరదృష్టితో వ్యవహరించడం వల్ల ఈ వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. 2018-19లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 7.4 శాతం నమోదవుతుందని, అలాగే ఈ ఆర్థిక సంవత్సరం చిల్లర ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న ఆర్‌బీఐ అంచనాల పట్ల మదుపరులు సానుకూలంగా స్పందించారు. ఈ వారంలో దేశీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, నాలుగు సెషన్లలో కీలక సూచీలు పుంజుకున్నాయి. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలయిన అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య పోరు కారణంగా మార్కెట్లు బుధవారం భారీగా నష్టపోయాయి. చైనానుంచి వచ్చే దిగుమతులపై అమెరికా భారీ మొత్తంలో సుంకాలను విధించడం, అందుకు ప్రతీకార చర్యగా అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై చైనా అదే స్థాయిలో సుంకాలను విధించడం వల్ల ప్రపంచ వాణిజ్య యుద్ధం దిశగా పరిస్థితులు తీవ్రం కావడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ఈ ప్రతికూల ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపైనా పడింది. అందువల్లే బుధవారం సెషన్‌లో దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు పతనమయ్యాయి. అయితే, ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాలు, అంచనా స్థూలార్థిక గణాంకాలతో పాటు మదుపరులు కార్పొరేట్ కంపెనీల ఫలితాలవైపు దృష్టి మరల్చడంతో దేశీయ మార్కెట్లు నిలదొక్కుకున్నాయి.
సెనె్సక్స్ ఈ వారం 33,030.87 పాయింట్ల వద్ద ప్రారంభమయి, 33,697.51- 32,972.56 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం వారంతో పోలిస్తే 658.29 పాయింట్ల (1.99 శాతం) లాభంతో 33,626.97 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ గత వారం 372.14 పాయింట్లు (1.14 శాతం) పెరిగిన విషయం విదితమే. నిఫ్టీ ఈ వారం 10,151.65 పాయింట్ల వద్ద ప్రారంభమయి, 10,350.45- 10,111.30 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు గత వారంతో పోలిస్తే 217.90 పాయింట్ల (2.15 శాతం) లాభంతో 10,331.60 పాయింట్ల మధ్య స్థిరపడింది.
మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్ల ధరలు బాగా పెరిగి, కీలక సూచీలు పుంజుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. వాహన, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆరోగ్య సంరక్షణ, ఎఫ్‌ఎంసీజీ, ప్రభుత్వ రంగ సంస్థలు, క్యాపిటల్ గూడ్స్, చమురు- సహజ వాయువు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి, టెక్నాలజి రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
ఇదిలా ఉండగా, ఈ వారంలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు), విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ. 430.37 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. సెనె్సక్స్ ప్యాక్‌లోని 31 సంస్థల్లో 23 సంస్థల షేర్ల ధరలు పెరగగా, మిగతా ఎనిమిది సంస్థల షేర్ల ధరలు పడిపోయాయి.