బిజినెస్

ఆస్తుల అమ్మకంలో ఓ ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (జియో)కు తన ఆస్తుల విక్రయ వ్యవహారంలో అతని సోదరుడు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)కు న్యాయస్థానాలు తాజా గా వెలువరించిన రెండు ఆదేశాలు కొంత మేరకు కలిసివచ్చాయి. ఆర్‌కామ్‌కు చెందిన కొన్ని ఆస్తులను రిలయన్స్ జియోకు విక్రయించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని రుణదాతలకు అనుమతిస్తూనే, ఆర్‌కామ్‌కు మైనారిటీ వాటాదారులతో తలెత్తిన విభేదాలపై తుది నిర్ణయం వెలువడే వరకు ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన నగదును ఎస్క్రో ఖాతాలో ఉంచాలని నేషనల్ కంపనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) శుక్రవారం ఆదేశించిన విషయం విదితమే. ఎరిక్సన్ ఏబీ భారతదేశ శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ ఆస్తుల విక్రయ ఒప్పందాన్ని నిలిపివేస్తూ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన మరుసటి రోజే ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఆర్‌కామ్‌కు పాక్షిక విజయా న్ని అందించాయి. ఆర్‌కామ్‌కు హెచ్‌ఎస్‌బీసీ డైసీ ఇనె్వస్ట్‌మెంట్స్ (మారిషస్)తో నెలకొన్న విభేదాలపై తుది తీర్పు వెలువడిన తరువాతనే ఆర్‌కామ్ ఆస్తుల విక్రయ ప్రక్రియ ముగుస్తుందని ఎన్‌సీఎల్‌ఏటీ శుక్రవారం స్పష్టం చేసింది. తానెంతో వేధింపులకు గురయ్యానని, ఆ వేధింపులు సాధారణం కాదని అనిల్ అంబానీ కొంత కాలంగా సాగుతున్న ఆస్తుల అమ్మకం ప్రక్రియ, ఆటంకాల నేపథ్యంలో వ్యాఖ్యానించారు. మొత్తం మీద రెండు న్యాయస్థానాలు తాజాగా వెలువరించిన ఆదేశాలతో ఆర్‌కామ్ తన వాయుతరంగాలు, టవర్లు, ఫైబర్ ఆస్తులను అనిల్ అంబానీ సోదరుడయిన ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు విక్రయించే ప్రక్రియ ముగింపు దిశగా ఓ అడుగు ముందు కు పడింది. ఆర్‌కామ్ టవర్ యూని ట్ అయిన రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌లో హెచ్‌ఎస్‌బీసీ డైసీకి నాలుగు శాతం కన్నా కాస్త ఎక్కువగా వాటా ఉంది. ఈ కేసు తిరిగి ఏప్రిల్ 18న విచారణకు రానుంది.
ఇదిలా ఉండగా, ఆర్‌కామ్ షేర్ల విలువ గత రెండు సెషన్లలో పది శాతం పెరిగింది. తన ఆస్తుల విక్రయంపై ఉన్న స్టేను ఎత్తివేస్తే రానున్న కొన్ని వారాలలో తన రుణభారంలో సుమారు రూ. 25వేల కోట్లు తగ్గుతుందని ఆర్‌కామ్ ఈ నెల 5వ తేదీన ఎక్స్చేంజీలకు తెలిపింది. రిలయన్స్ జియోకు ఆస్తుల విక్రయం అంశాన్ని ఆర్‌కామ్ నిరుడు డిసెంబర్ చివరలో ప్రకటించింది. ఈ విక్రయ ఒప్పందం ఆర్‌కామ్‌కు ఒక బెయిలవుట్‌లాగా ఉపయోగపడుతుంది. అంటే ఆర్‌కామ్ రుణ ఎగవేత సంస్థ అభియోగాల నుంచి బయటపడటానికి దోహదపడుతుంది.