బిజినెస్

నాలుగో త్రైమాసికంలో కీలక వడ్డీ రేట్లు పెరగొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఈ సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశముంది. అప్పటికి దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం2కానుండటంతో, ఆర్‌బీఐ ఈ చర్యకు ఉపక్రమించవచ్చునని, మోర్గాన్ స్టాన్లీ నివేదిక అంచనా వేసింది. తన అంచనాకు ఈ సంస్థ ప్రధానంగా రెండు కారణాలను సూచించింది. మొదటిది ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంకు నిర్దేశించిన పరిమితిని దాటకపోవడం, రెండవది దేశ ఆర్థిక వ్యవస్థ గాట్లో పడటం. ఇదిలావుండగా 2018-19 రెండో త్రైమాసికంలో ఆర్బీఐ రెపోరేటులో ఏవిధమైన మార్పు చేయలేదు. ఫలితంగా ఇది ఆరు శాతం వద్దనే స్థిరంగా కొనసాగుతోంది. ఈవిధంగా రెపోరేటును యథాతథ స్థితిలో కొనసాగించడం, గత ఆగస్టు నుంచి ఇది నాలుగోసారి. ఆర్‌బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ప్యానల్ రెపోరేటు యథాతథంగా ఉంచడానికే ఓటు వేశా రు. అయితే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ పత్ర మాత్రం రెపోరేటును 25 బేసిక్ పాయింట్లు పెంచాలని కోరారు.
కాగా డ్యూట్ఛీ బ్యాంకు అంచనా మరోలా ఉంది. ఈ ఏడాది ఋతుపవనాల సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదై, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారల్‌కు 70 యుఎస్‌డి కంటె తక్కువ ధర పలికినట్లయితే ఆర్‌బీఐ రెపోరేటులో ఏవిధమైన మార్పు చేయకపోవచ్చునని అంచనా వేసింది.
ఈ సైకిల్‌లో 75 బీపీఎస్ అధిక రేటు నమోదవుతుందని మేం అంచనా వేస్తున్నాం. అయితే ఈ పెరుగుదల వచ్చే ఏడాది తొలినాళ్లనుంచి ప్రారంభమవుతుంది,2అని డ్యూట్ఛీ బ్యాంకు పరిశోధన అంచనా వేసింది.