బిజినెస్

స్థూలార్థిక గణాంకాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కార్పొరేట్ కంపెనీల ఫలితాలు వెలువడనున్న తరుణంలో స్థూలార్థిక గణాంకాల వంటి దేశీయ పరిణామాలు, వాణిజ్య సుంకాల పోరు వంటి ప్రపంచ పరిణామాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో భారత స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనున్నాయని నిపుణుల అంచనా. 3వచ్చే వారం నుంచి వెలువడే అవకాశం ఉన్న కార్పొరేట్ కంపెనీల ఫలితాలపైకి తిరిగి మార్కెట్ల దృష్టి మరలుతుంది2 అని కోటక్ సెక్యూరిటీస్ పరిశోధన విభాగం వైస్ ప్రెసిడెంట్ టీనా విర్మాని పేర్కొన్నారు.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్చి 31తో ముగిసిన తన నాలుగో త్రైమాసిక ఫలితాలను ఈ నెల 13న ప్రకటించనుంది. వచ్చే వారం తమ ఫలితాలను ప్రకటించనున్న సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గోవా కార్బన్ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రారంభించిన దిగుమతి సుంకాల పెంపు, కొత్త సుంకాల విధింపు వల్ల అమెరికా, చైనాల మధ్య మొదలయిన వాణిజ్య పోరు కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధికి విఘాతం కలిగే ప్రమాదం నెలకొంది. ఈ పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుండటమే కాకుండా, అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ప్రతిష్టంభన తీవ్రమయి, ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం కొనసాగే అవకాశం ఉంది2 అని విర్మాని పేర్కొన్నారు. ప్రస్తుత (1918-19) ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ అంచనా వృద్ధి రేటు పెరుగుతుందని, అంచనా చిల్లర ద్రవ్యోల్బణం తగ్గుతుందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన సమీక్షలో తేలడంతో సానుకూలంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో లాభాలను గడించాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం ఆర్థిక వ్యవస్థ అంచనా వృద్ధి రేటును ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) గతంలో ప్రకటించిన 6.6 శాతం నుంచి 7.4 శాతానికి పెంచింది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అంచనాను 4.7-5.1 శాతానికి తగ్గించింది. ఆహార వస్తువుల ధరల పెరుగుదల రేటు మందగించడం, రుతు పవనాలు సాధారణ స్థాయిలో ఉంటాయనే అంచనాతో ఆర్‌బీఐ చిల్లర ద్రవ్యోల్బణం అంచనాను తగ్గించింది.
ఈ అంశం దేశీయ స్టాక్ మార్కెట్లకు సానుకూలంగా పరిణమించనుంది. దీంతో పాటు 2017-18తో పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరం ఉత్తమంగా ప్రారంభం అవుతుందన్న విశ్వాసం నెలకొని ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీల నాలుగో త్రైమాసిక (క్యూ 4) ఫలితాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు కీలకమయిన అంశం. చిల్లర (సీపీఐ) ద్రవ్యోల్బణం కూడా మార్కెట్లకు కీలకమయిన స్థూలాంశంగా ఉంటుంది..2 అని నాయర్ పేర్కొన్నారు. చిల్లర ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు గురువారం వెలువడనున్నాయి.