బిజినెస్

పూర్తి నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన రూ.13,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి పూర్తి విజిలెన్స్ నివేదిక కోసం ఎదు రు చూస్తున్నామని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) తెలియజేసింది. కాగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సమగ్ర వివరాలతో బ్యాంకుకు సంబంధించిన ఆడిటర్లను విచారణకు హాజరు కావాలంటూ ఆదివారం ఆదేశించినట్టు కూడా వెల్లడించింది. నివారణ విజిలెన్స్ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలంటే రోజువారీగా అనుసరించే విధానాలు మాత్రమే కాదు, ఆ నివేదికల్లోని వాస్తవికతను పరిశీలించాలి అని సీవీసీ పేర్కొంది. బ్యాంకు ఆడిటర్లు, ఆడిట్ చేసే విధానాన్ని పరిశీలిస్తున్నామని సీవీసీ తెలిపింది. కాగా విచారణకు హాజరు కావడానికి ఆడిటర్లకు తగిన సమయం ఇచ్చామని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కె.వి. చౌదరి తెలిపారు. దాదాపు డజనుమంది ఆడిటర్లున్నారు. వీరందరినీ ఒక్కరొక్కరిగా విచారిస్తామని ఆయ న వెల్లడించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన చీఫ్ విజిలెన్స్ అధికారి (సీవీఓ) నుంచి పూర్తి వివరాలు కోరామన్నారు. మధ్యంతర నివేదిక వచ్చింది కానీ మరికొన్ని సమస్యలకు సంబంధించి సవివరమైన నివేదికకోసం వేచిచూస్తున్నామన్నారు. బ్యాంకుల్లో విజిలెన్స్ యం త్రాంగాన్ని మరింత బలోపేతం చేయాల్సి ఉన్నదన్నారు. ‘పంజాబ్ నేషనల్ బ్యాంకులో కూడా, సిఫ్ట్ మెసేజ్‌లకు సంబంధించి విధివిధానాలున్నాయి. మేనేజర్, సర్కిల్ ఆఫీస్ మేనేజర్, జోనల్ మేనేజర్‌లు నియమిత కాలావధుల్లో ధ్రువీకరణ పత్రా లు జారీ చేయాలి. వీరు ఈ సందేశాలను పరిశీలించకుండానే సర్ట్ఫికెట్లు జారీచేస్తున్నారు’ అని అన్నారు.