బిజినెస్

నూరు శాతం టర్నోవర్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ టర్నోవర్ ఈ ఆర్థిక సంవత్సరంలో నూరు శాతం వృద్ధి సాధించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. 2015-16, 2016-17లో సరాసరి టర్నోవర్ రూ.113 కోట్లు ఉండగా, 2017-18లో రూ.220 కోట్లకు చేరి రికార్డు స్ధాయిలో 95 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. 2018-19 సంవత్సరంలో ఈ వృద్ధి నూరు శాతం దాటే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా భాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు శాఖ, దానిలోని అంతర్గత విభాగాల్లోని నిర్మాణ పనులే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖల్లోని పనులను సైతం తమ సంస్థకు అప్పగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పోలీస్ సిబ్బంది క్వార్టర్లు చాలా చోట్ల నివాసానికి పనికి రాకుండా ఉన్నందున వాటి స్థానంలో అన్ని వసతులతో సుమారు 1200 అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ప్రతిపాదన ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు చెప్పారు. తమ సంస్థకు ప్రభుత్వం రూ.1,439.55 కోట్ల పనులకు సంబంధించి పరిపాలనా పరమైన అనుమతి మంజూరు చేసిందని పేర్కొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్లాన్ కింద రూ.424.09 కోట్లు, నాన్ ప్లాన్ కింద రూ.40.37 కోట్లు కలిపి మొత్తం రూ.464.46 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై ఉంచి అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ బంగారు తెలంగాణ సాధనకు తన వంతు సహకారం అందిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్, జైళ్లు, అగ్నిమాపకదళ, విపత్తు నివారణ శాఖల్లోనే కాకుండా ఇతర శాఖలైన ఎక్సైజ్, ఆబ్కారీ, పశువైద్య విశ్వవిద్యాలయం, అటవీశాఖలో నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలో రూ.50 కోట్లతో 15 పనులు, పశువైద్య విశ్వవిద్యాలయంలో రూ.147.05 కోట్లతో 39 పనులు, ఎక్సైజ్ శాఖలో రూ.3.58 కోట్లతో 8 భవనాల నిర్మాణం, ఆబ్కారీ విభాగంలో రూ.20 కోట్లతో 51 భవనాల నిర్మాణాలను తమ సంస్థ చేపట్టిందని తెలిపారు. వీటిలో కొన్ని పూర్తవగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. పోలీస్ శాఖలో చేపట్టిన పనుల గురించి ఆయన వివరిస్తూ రామగుండం కమిషనరేట్ పరిధిలో గోదావరి ఖని మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడంతస్తుల భవనాన్ని రూ.4.50 కోట్ల వ్యయంతో నిర్మించనుండగా, దీనిలో రూ.3 కోట్లు సింగరేణి కాలరీస్ భరిస్తోందని తెలిపారు. అలాగే రామగుండంలో పోలీసు అతిథి గృహంతో పాటు సంక్షేమ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన భూమిని సింగరేణి సమకూర్చగా, నిధులను ఎన్‌టిపిసి సమకూర్చుతోందని తెలిపారు.
వీటితో పాటు 10 వేర్వేరు పథకాల కింద ప్రభుత్వం మంజూరు చేసిన రూ.236.82 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 103 పోలీస్ స్టేషన్ల భవనాల నిర్మాణం చేపట్టగా, వీటిలో 35 పూర్తయి, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నట్లు దామోదర్ వివరించారు. 13 జిల్లా పోలీస్ కార్యాలయాలు, రెండు కమిషనరేట్లుకు సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. రూ.81.52 కోట్ల వ్యయంతో 289 పోలీస్ క్వార్టర్ల నిర్మాణం చేపట్టగా, వాటిలో 126 పనులు పూర్తి కాగా, 163 పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రిసెప్షన్ సెంటర్లు, ఫ్రంట్ ఆఫీస్‌ల నిర్మాణానికి సంబంధించిన 90 పనులకు గాను రూ.10 కోట్లతో 43 పనులను ఇప్పటికే చేపట్టి పూర్తి చేయగా, మిగిలిన 47 పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. అగ్నిమాపక దళంలో 137 పనులకు గాను 87 పూర్తయినట్లు చెప్పారు. రూ.48.50 కోట్ల వ్యయంతో పిటిసిలు, సిటిల నిర్మాణం చేపట్టగా, తెలంగాణ పోలీసు అకాడమిలోరూ.20 కోట్లతో పనులు చేపట్టి పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. విలేఖరుల సమావేశంలో కార్పొరేషన్ ఎండి బి.మల్లారెడ్డి, చీఫ్ ఇంజినీర్ ఎన్.గోపాలకృష్ణ, ఎస్‌ఈ టి.విజయకుమార్ పాల్గొని సంస్థ వివరాలను అందించారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్