బిజినెస్

మా సమస్యను మేమే పరిష్కరించుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఇటీవల చోటు చేసుకున్న రూ.13వేల కోట్ల స్కాం వల్ల ఉత్పన్నమైన సమస్యలను తామే పరిష్కరించుకుంటామని, ఈ విషయంలో ప్రభు త్వ సహాయం అర్థించలేదని పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ మెహతా స్పష్టం చేశారు. నీరవ్ మోదీ అక్రమాల వల్ల వాటిల్లిన నష్టంనుంచి బయటపడే సామర్థ్యం బ్యాంకునకు ఉన్నదని ఆయన తెలిపారు. ‘ఇది పూర్తిగా బ్యాంకు సమస్య. దీన్ని మేమే పరిష్కరించుకుం టాం. పెట్టుబడుల రూపం లో ప్రభుత్వం నుంచి ఏవిధమైన సహా యం కోరబోము’ అని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా మూలధన కల్పనకోసం ప్రభుత్వం అందించే సహాయం తీసుకుంటాం. అంతేకాని మరింత సహాయం కావాలని కేంద్రా న్ని అడగబోమన్నారు. గత సెప్టెంబర్ నెలాఖరు నాటికి బ్యాంకు దాదాపు రూ.12వేల కోట్లు సమీకరించింది. రూ.5వేల కోట్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ ద్వారాను, మరో రూ.1300 కోట్లు పీఎన్‌బీ హౌజింగ్ ఫైనాన్స్‌లో వాటాలు అమ్మడం ద్వారా సమకూర్చుకున్నామని ఆయన తెలిపారు. ఇక కేంద్ర ప్రభుత్వం రూ.5,400 కోట్లను అందించింది.
‘మా వ్యాపారాన్ని యథాతథంగా కొనసాగించడానికి అవసరమైన పెట్టుబడులను సమీకరించుకున్నాం’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ విధంగా సమకూర్చుకున్న నిధులతో పాటు వరుసగా మూడు త్రైమాసాలనుంచి బ్యాంకు రూ.1,100 కోట్లమేర లాభాలు ఆర్జించిందన్నారు. ఈ మొత్తం బ్యాంకు యధావిధిగా తన కార్యకలాపాలు నిర్వహించడానికి దోహదపడుతున్నాయన్నారు.
నీరవ్ మోదీ ఆయన బంధువు మెహుల్ చోక్సీలకు చెందిన కంపెనీలకు పీఎన్‌బీ ముంబయిలోని ఒక బ్రాంచి తప్పుడు ఎల్‌ఓయూలను ఇవ్వడం వల్ల మొత్తం రూ.13వేల కోట్ల మేర నిధులు దుర్వినియోగమయ్యాయి.