బిజినెస్

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిసాయి. వరుసగా మూడవ సెషన్‌లో కూడా సెనె్సక్స్ 162 పాయింట్లు లాభంతో, 33,788 వద్ద ముగియగా, నిఫ్టీ 47.75 పాయింట్ల లాభంతో 10,379.35 వద్ద ముగిసింది. మదుపర్లు ఉత్సాహంగా బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ షేర్ల కొనుగోళ్లు చేపట్టడంతో మార్కెట్లు మొదటినుంచి లాభాలబాటలోనే నడిచాయి.
గత వారం రిజర్వ్‌బ్యాంకు వృద్ధి రేటును 7.4 శాతంగా అంచనా వేయడం, 2018-19 తొలి అర్థ్భాగంలోద్రవ్యోల్బణం 4.7-5.1 మధ్య నమోదుకావడం కూడా మార్కెట్ల ఊతానికి దోహదం చేసింది. ఇక ఆసియన్ మార్కెట్లనుంచి సానుకూల పరిణామాలు, యూరోపియన్ షేర్లు సుస్థిరంగా కొనసాగడం, అమెరికా వడ్డీరేట్లు పెంచడం కూడా మార్కెట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపాయి. ‘ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, ముడి చమురు ధరలు తగ్గుతాయన్న అంచనా, యుఎస్‌లో ఉత్పత్తి ఊపందుకోవడం, భారత్‌లో ఈ వ్యవసాయ సీజన్‌లో ఋతుపవనాలు సానుకూలంగా ఉంటాయన్న అంచనాలు మార్కెట్‌కు ఊతమిచ్చే అంశాలని’ జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెట్, పరిశోధక విభాగం అధినేత వినోద్ నాయర్ అన్నారు. సోమవారం సెనె్సక్స్ స్థిరంగా ప్రారంభమై ఒక దశలో 33,846.50ను తాకి చివరకు 33,788.54 వద్ద, 161.57 పాయింట్ల నికర లాభంతో ముగిసింది. నిఫ్టీకూడా సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమై ఒక దశలో 10,397.70ను తాకి చివరకు 10,379.35 వద్ద ముగిసింది. కాగా గత శుక్రవారం దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.1,305.45 కోట్ల విలువైన షేర్ల కొనుగోలు చేయగా, విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు రూ.524.85 కోట్ల మేర షేర్ల అమ్మకాలు జరిపినట్టు స్టాక్ ఎక్చేంజ్‌ల ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇక సెనె్సక్స్ ప్యాక్‌లో యాక్సిస్ బ్యాంకు లాభాల్లో అగ్రస్థానంలో నిలవగా, ఎం అండ్ ఎం తర్వాతి స్థానం ఆక్రమించింది. ఐటీసీ లిమిటెడ్, ఇండస్‌ల్యాండ్ బ్యాంక్, హింద్ యునిలివర్, ఆసియన్ పెయింట్స్, మారుతి సుజికి, ఓఎన్‌జీసి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్ బ్యాంకు, ఎస్‌బీఐ, విప్రో, హీరో మోటార్ కార్పొరేషన్, టాటాస్టీల్ కంపెనీ షేర్లు లాభాల బాటలో పయనించాయి. ఇక ఇన్ఫోసిస్ షేర్లు బాగా నష్టపోగా, టాటా మోటార్స్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది. భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, బజాజ్ ఆటో, పవర్‌గ్రి, ఆదాని పోర్ట్స్, సన్ ఫార్మాల షేర్లు నష్టాలతో ముగిశాయి.