బిజినెస్

వెనుకబడిన జిల్లాలకు వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: దేశవ్యాప్తంగా బాగా వెనుకబడిన 115 జిల్లాల్లో, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రోత్సహించేందుకు భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (ఎస్‌ఐడీబీఐ) ఒక ప్రణాళికను రూపొందించింది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ) సహాయం తీసుకుంటున్నట్టు బ్యాంక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ ముస్త్ఫా మంగళవారం వెల్లడించారు. ‘ది ట్రాన్సఫర్మేషన్ ఆఫ్ యస్పైరేషనల్ డిస్ట్రిక్ట్స్’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2018, జనవరి 5న ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలనుంచి బాగా వెనుకబడిన జిల్లాలను ఎంపిక చేసి వాటిల్లో సామాజిక, ఆర్థిక మార్పులకోసం మైక్రో ఎంటర్‌ప్రైజెస్ ఏర్పాటును ప్రోత్సహిస్తారు. ‘మైక్రో ఎంటర్‌ప్రైజెస్ ప్రొమోషన్ ప్రోగ్రామ్’ (ఎంఈఈపీ) పేరుతో ఈ కార్యక్రమాని ఎస్‌ఐడీబీఐ అమలు చేస్తుంది. ఆయా జిల్లాలకు చెందిన జిల్లా మేజిస్ట్రేట్లు ‘ప్రభారి’ అధికార్లుగా వ్యవహరిస్తారు. వీరు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా కార్యక్రమాలను అమలు జరుపుతారు. వీరికి ఢిల్లీలోని సంబంధిత శాఖల కార్యదర్శులు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఔత్సాహికులను ప్రోత్సహించి, వారికి తగిన చేయూతనిచ్చి, సంప్రదాయిక బ్యాంకింగ్ రంగంతో వారిని అనుసంధానించడం ఎంఈపీపీ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన దగ్గరినుంచి ఇప్పటివరకు 41,500 సంస్థల ఏర్పాటు జరగ్గా, అణగారిన వర్గాలకు చెందిన 1.07 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. గత నెలలో ఎస్‌ఐడీబీఐ, సీఎస్‌సి-ఈగవర్నెన్స్ సర్వీసెస్‌తో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని ప్రకారం సీఎస్‌సి-ఈగవర్నెన్స్ సర్వీసు ద్వారా ‘ఉద్యమి మిత్ర’ పోర్టల్‌ను అన్ని ‘మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్’ (ఎంఎస్‌ఎంఈ)లకు అందేలా చూస్తారు.
‘ఉద్యమమిత్ర.ఇన్’ పోర్టల్, ఎంఎస్‌ఎంఈలకు రుణసహాయం మరింత అందుబాటులోకి వచ్చేలా సహాయపడుతుంది. ఈ పోర్టల్ ద్వారా ఆయా సంస్థలు బ్యాంకులకు వెళ్లనవసరం లేకుండానే రుణాలకోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. సీఎస్‌సి ఈ-గవర్నెన్స్ ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వెహికిల్. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖ దీన్ని ప్రవేశపెట్టింది. వివిధ డిజిటల్ సర్వీసులను ఈ పోర్టల్, గ్రామాలకు అనుసంధానించడమే దీని పని.