బిజినెస్

భారత్ మార్కెట్లోకి గూగుల్ ‘హోమ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ‘హోమ్’ పేరుతో వాయిస్-యాక్టివేటెడ్ స్పీకర్లను భారతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. అంతకుముందే మార్కెట్లోకి వచ్చిన ‘అమెజాన్ ఎకో’ వంటి పరికరాలకు పోటీగా దీన్ని ప్రవేశపెట్టడం గమనార్హం. ఇందులో ‘హోమ్’, ‘హోమ్ మిని’ అనే రెండు రకాలున్నాయి. వీటి ఖరీదు వరుసగా రూ.9,999, రూ.4,499. ఇవి ప్రత్యేకించి ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయా సేల్స్ వంటి 750 రిటైల్ స్టోర్లలో లభ్యమవుతాయి. ‘భారతీయ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా వీటిని రూపొందించామని’ గూగుల్ వీపీ ప్రాడక్ట్ మేనేజ్‌మంట్ అండ్ జనరల్ మేనేజర్ ఆఫ్ హోమ్ ప్రాడక్ట్స్ రిషి చంద్ర విలేఖరులకు తెలిపారు. త్వరలోనే ఇందులో ‘హిందీ’ భాషను కూడా ప్రవేశపెట్టాలన్న యోచన కూడా ఉన్నదని ఆయన వెల్లడించారు. తమకు సావన్, గానా, ఇండియా టుడే, ఆజ్ తక్ వంటి సంస్థలతో భాగస్వామ్యమున్నదన్నారు. గూగుల్ గత ఏడాది ప్రవేశపెట్టిన ‘అసిస్టెంట్’ ప్రస్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లన్నింటిలో లభ్యమవుతోంది.