బిజినెస్

ప్రతిభకే పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: దేశంలోని వివిధ రంగాలకు చెందిన సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు 2018-19 ఆర్థిక సంవత్సరంలో సగటున 9.6 శాతం మాత్రమే జీతభత్యాల్లో పెరుగుదల ఉండనుంది. అయితే ప్రతిభావంతులైన ఉద్యోగులకు 14.7 శాతం వరకు జీతాలు పెంచడానికి వివిధ పారిశ్రామిక సంస్థలు వెనుకాడటంలేదని, పీపుల్ అండ్ ఛేంజ్ అడ్వైజరీ సర్వీసెస్, కెపిఎంజి అధినేత విశాలీ దోంగ్రీ అన్నారు. 18 రంగాలకు చెందిన 270 సంస్థలు తాము నిర్వహించిన ‘యాన్యువల్ కాంపెనే్సషన్ ట్రెండ్స్ సర్వే 2018-19’ సర్వేలో పాల్గొన్నాయని విశాలీ దోంగ్రీ తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీతాలు సగటున 9.7 శాతం పెరుగుతాయని అంచనా వేసినప్పటికీ వాస్తవానికి కేవలం 9.4 శాతం మాత్రమే పెరిగాయన్న సంగతి ఈ సర్వే నివేదిక గుర్తు చేసింది. కాగా సర్వేలో పాల్గొన్న వాటిల్లో 19.9 శాతం సంస్థలు, ప్రతిభను గుర్తించేందుకు మూడు కీలకాంశాలను ఎంచుకున్నాయి. వీటిల్లో ఏ ఒక్కదాన్ని సంతృప్తిపరచినా అటువంటి ఉద్యోగులకు ఆకర్షణీయమైన వేతనాలు ఇవ్వడానికి అవి వెనుకాడటంలేదని నివేదిక పేర్కొంది. అయితే 75 శాతం సంస్థలు, మంచి పనితీరు, ప్రతిభను కనబరచే ఉద్యోగులకు సగటున 14.7 శాతం వేతనాన్ని పెంచేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాలని నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2017-18లో వేరియబుల్ పే ప్రొజెక్షన్ 15.4 శాతం నుంచి, 2018-19లో 15.7 శాతానికి పెరగడం, సంస్థలు... పనితీరుకు, ప్రతిభకే ప్రాధాన్యతనిస్తున్నాయన్న దాన్ని స్పష్టం చేస్తున్నదని పేర్కొంది. కాగా అత్యధిక వేరియబుల్ చెల్లింపులు ఆర్థిక రంగంలో చోటు చేసుకోగా, అతి తక్కువ చెల్లింపులు ఎన్‌జీఓ సంస్థల్లో జరిగాయి. ఈ నివేదిక 2018లో ఉద్యోగులకు సంబంధించి హెచ్‌ఆర్ పోకడలు ఏవిధంగా ఉన్నాయన్న దానిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది.