బిజినెస్

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్‌లో కూడా లాభాల్లో కొనసాగాయి. ఆసియాన్ మార్కెట్లలో సానుకూల పవనాలు, యూరోపియన్ షేర్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడం, వాల్‌స్ట్రీట్‌లో ప్రోత్సాహక వాతావరణం దేశీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. కాగా అంతర్జాతీయ వాణిజ్యపోరు తగ్గుముఖం పట్టడం, చైనా తన భవిష్యత్ ఆర్థిక అజెండాను ప్రకటించడం, కొన్ని వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గించడం వంటి పరిణామాలు దేశీయ మార్కెట్లు ఊపందుకోవడానికి మరో కారణం. ఆటోమొబైల్స్ దిగుమతి సుంకాలను తగ్గిస్తామని, విదేశీ కంపెనీల మేథోహక్కులను పరిరక్షిస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మంగళవారం ప్రకటించడం ఆ దేశ మార్కెట్లను విదేశీ సంస్థలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చినట్లయింది. మదుపర్లలో ఈ పరిణామాలు విశ్వాసాన్ని పాదుగొల్పడంతో ఉత్సాహంగా కొనుగోళ్లు జరిపారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సెనె్సక్స్ 92 పాయింట్లు లాభపడి 33,880 వద్ద ముగియగా, నిఫ్టీ 22.90 పాయింట్లు లాభపడి, 10,402 వద్ద ముగిసింది. సెనె్సక్స్ ఒకదశలో 33,949.98ను తాకినప్పటికీ చివరకు 91.70 పాయింట్ల లాభంతో 33,880.25 వద్ద ముగిసింది.
దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.359.35 కోట్ల మేర షేర్లను కొనుగోలు చేయగా, పోర్టుపోలియో మదుపర్లు రూ.1300.93 కోట్ల విలువైన షేర్ల అమ్మకాలు జరిపారు. యాక్సిస్ బ్యాంకు షేర్లు అధికంగా లాభపడగా, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు తర్వాతి స్థానాన్ని ఆక్రమించాయి. కాగా ఆదాని పోర్ట్స్, టాటాస్టీల్, కోల్ ఇండియా, ఎల్ అండ్ టీ, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, ఎస్ బ్యాంకు, ఓఎన్‌జీసీ, టీసీఎస్, విప్రో, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, ఐటీసీ, హెచ్‌యుఎల్, ఆర్‌ఐల్ సంస్థలు షేర్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. ఇక టాటామోటార్స్, ఎం అండ్ ఎం, హీరోమోటోకార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇండస్‌లాండ్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, ఎన్‌టీపీసీ, మారుతి సుజ్‌కీ, బజాజ్ ఆటోల షేర్లు నష్టాల్లో కొనసాగాయి.