బిజినెస్

చెరకుపై సబ్సిడీ ఇచ్చే యోచనలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: చెరకు పండించే రైతులకు సబ్సిడీ ఇచ్చే ఆలోచన ఏదీ లేదని కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది. ముఖ్యంగా దేశంలో చెక్కర మిల్లులు నిధుల్లేక తీవ్ర ఇక్కట్లలో ఉన్న నేపథ్యంలో, వాటివద్ద అదనంగా ఉన్న నిల్వల్లో రెండు మిలియన్ టన్నులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతించింది. అవసరమైతే నష్టాలకైనా ఎగుమతి చేసుకోవచ్చునని కేంద్రం ఆయా మిల్లులను కోరింది. ఇందుకు అనుగుణంగా చెరుకు ఎగుమతిపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని రద్దు చేసింది. ఇదే సమయంలో చెరుకు దిగుమతిపై వంద శాతానికి పెంచింది. 2017-18 సీజన్‌లో చెరుకు దిగుబడులు 29.5 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చునని అంచనా. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పై చర్యలు తీసుకుంది. అంతేకాదు ‘మిలియనియం ఇండికేటివ్ ఎక్స్‌పోర్ట్ కోటా’ పథకం కింద రెండు మిలియన్ టన్నుల చక్కెర ఎగుమతికి అనుమతించింది. ‘ఇప్పటికి ఉత్పత్తి అనుసంధానిత సబ్సిడీపై తక్షణ ప్రణాళికలు ఏమీ లేవు’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2016-17లో దేశంలో చెరుకు ఉత్పత్తి 20.3 మిలియన్ టన్నులు కాగా, 2017-18 సీజన్‌లో ఇది 29.5 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా. ఫలితంగా దేశీయంగా రిటైల్ మార్కెట్‌లో చక్కెర ధర పడిపోయే అవకాశం ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్ కూడా దారుణ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే మిల్లులు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.15వేల కోట్లకు చేరుకున్నాయి. ‘ప్రతి మిల్లు తనకు కేటాయించిన కోటాను ఎగుమతి చేయాలని నిర్ణయించుకుంటే, అది రెండు మిలియన్ టన్నులకు చేరుతుంది. అప్పుడు దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలు సుస్థిరమవుతాయి’ అన్నారు. ప్రసుత్తం ప్రపంచ మార్కెట్‌ను పరిశీలిస్తే మిల్లులు కేజీకి రూ.5-7ల వరకు నష్టపోయే అవకాశముంది. ఎగుమతుల తర్వాత దేశీయ మార్కెట్‌లో మెరుగైన ధరలకు మిగిలిన స్టాకును అమ్ముకోవడం ద్వారా ఆ నష్టాన్ని పూడ్చుకోవచ్చునని ఆహార మంత్రిత్వశాఖకు చెందిన అధికారి తెలిపారు. అదీ కాకుండా మరో రెండేళ్లపాటు అమల్లో ఉండే ‘డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ పథకం’ వల్ల కలిగే ప్రయోజనాన్ని మిల్లులు ఉపయోగించుకోవచ్చునని ఆయన వివరించారు. రెండు మిలియన్ టన్నుల చక్కెర ఎగుమతి అయితే దేశీయంగా కిలోకు రూ.1-2లు ధర పెరుగుతుంది. మిగిలిన స్టాకును దేశీయంగా అమ్ముకోవడం ద్వారా మిల్లులు కోలుకోగలుగుతాయన్నారు. ఇప్పుడు ఎక్స్-మిల్లు ధరలు కిలోకు రూ.30 కంటే తగ్గిపోయాయి. ఇది కిలో ఉత్పత్తి ఖర్చు రూ.35-36 కంటే చాలా తక్కువ. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మిల్లులు ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ ధరను చెల్లించాల్సి వస్తోంది.