బిజినెస్

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 18: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. అన్నాడో సినీ కవి. అవును మరి.. ఇప్పుడిలాగే ఉంది మార్కెట్‌లో మార్కెట్ పరిస్థితి. సంచుల్లో డబ్బు, జేబుల్లో వంట సామాగ్రి తెచ్చుకునే దుస్థితి నేడు తలెత్తిందంటే అతిశయోక్తి కాదు. కూరగాయలు, పప్పులు, మాంసం, గుడ్లు ఇలా ఒక్కటేమిటీ అన్ని ఆహారోత్పత్తుల ధరలు రెట్టింపయ్యాయి. ఫలితంగా సామాన్యుడి బడ్జెట్ తారుమారైంది. వర్షాభావమో లేక సరఫరా కొరతో మరి పంట దిగుబడి తగ్గడమో కారణం ఏదైనా దేశవ్యాప్తంగా ఆహార ధరలు ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతున్నాయి. ముఖ్యంగా పప్పుల ధరలైతే ఇంకా అదుపులోకి రావడం లేదు. గతకొద్ది నెలలుగా కందిపప్పు, మినపపప్పు సామాన్యుడికి అందుబాటులోకి లేకుండాపోయాయి. కిలో 160-200 రూపాయల మధ్య వాటి ధరలు కదలాడుతున్నాయి మరి. మొన్నటిదాకా దడ పుట్టించిన ఉల్లిగడ్డ ధర ఇప్పుడు దిగివచ్చినప్పటికీ, టమాట ధర కొండెక్కి కూర్చుంది. ఇతర కూరగాయల ధరలూ తక్కువేమీ లేవు. ఒకటి, అర మినహా మిగతా కూరగాయల ధరలన్నీ కూడా కిలో 50-80 రూపాయలు పలుకుతున్నాయి. మాంసం, చేపలు, గుడ్ల ధరలు కూడా రెక్కలు తొడిగాయి. దీంతో మార్కెట్‌లో కొనుగోళ్లు గణనీయంగా పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. వినియోగదారులు సైతం పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు తీవ్ర ఇబ్బందులు తప్పవనే ఆందోళనను వెలిబుచ్చుతున్నారు. ఇంతకుముందు రేషన్ షాపుల్లో కందిపప్పు కూడా ఇచ్చేవారని, ఇప్పుడు అదికూడా ఆపేశారని పేద, మధ్యతరగతి ప్రజానీకం అసహనం వ్యక్తం చేస్తోంది. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో పెరిగిన ధరల కారణంగా కడుపునిండా తిండి కూడా తినలేని దుస్థితిలో ఉన్నామని శ్రమజీవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ, అధికార యంత్రాంగం మాత్రం మార్కెట్‌లోకి సరఫరా పెరిగితే ధరలు అదుపులోకి వస్తాయని అంటోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. త్వరలోనే మార్కెట్ లోకి కొత్త పంట వస్తుందని, ధరలు తగ్గుముఖం పడతా యన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల నుంచి పప్పు ధాన్యాలను దిగుమతులు చేసుకుం టున్నామని చెప్పారు.